Advertisement
Google Ads BL

మొత్తానికి అల్లుడ్ని లైన్లో పెట్టాడు..!


సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి వారసులు వస్తూ ఉంటే వారిని మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు మెగాభిమానులు కూడా కావాల్సినంత హైప్‌ సృష్టిస్తారు. కానీ తన చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్‌ విషయంలో మాత్రం పెద్దగా హడావుడి లేకుండా ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేని సాధారణ హీరోగా పరిశ్రమకి పరిచయం చేయాలని చిరు భావిస్తున్నాడు. హైప్‌లేకుండా తన చిన్నల్లుడిని బరిలో దింపాలనే మెగాస్టార్‌ వ్యూహం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కళ్యాణ్‌కి సినిమాలపై ఆసక్తి ఉన్నా కూడా మొదట్లో మీ చిన్నల్లుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనేప్రశ్నకు చిరంజీవి కాదని సమాధానం ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

కానీ ఆయన తెరంగేట్రం చేయడం దాదాపు కన్‌ఫర్మ్‌ అయిపోయింది. నందమూరి హీరోల బేనర్‌లో పేరున్న వారాహిచలన చిత్రం అధినేత, త్వరలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే చిత్రాన్ని నిర్మించనున్న అభిరుచి ఉన్న నిర్మాత సాయి కొర్రపాటి ఈ మెగా అల్లుడిని తెరంగేట్రం చేసే బాధ్యతలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఇంతకు ముందు తన మొదటి చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రాకేష్‌శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు కూడా త్వరలో హీరోగా పరిచయం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలా చూసుకుంటే మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన వారసుల సంఖ్య త్వరలో రెండంకెలను నమోదు చేస్తుందని అందరూ భావస్తున్నారు. 

ఇక సంక్రాంతి పండగ సందర్భంగా అచ్చమైన తెలుగు పంచెకట్టులో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని మెగాస్టార్‌ చిరంజీవి, జీన్స్‌ ప్యాంట్‌, షర్ట్‌తో కూల్‌గా ఉన్న కళ్యాణ్‌తో కలిసి ఓ ఫొటో దిగగా.. అది ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మరోవైపు చిరంజీవి 'సైరా.. నరసింహారెడ్డి' సెకండ్‌ షెడ్యూల్‌ కోసం త్వరలో పొలాచ్చికి వెళ్లనున్నాడు. తన అల్లుడు తెరంగేట్రంని మామ చిరంజీవి చూసుకుంటూ ఉంటే, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడి తెరంగేట్రంని పవన్‌కళ్యాణ్‌ భుజాలకెత్తుకోనున్నాడని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో మెగా అల్లుడు మెప్పిస్తాడా? మెగా మేనల్లుడు మెప్పిస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Chiranjeevi and His Son In Law Photo Viral In Social Media:

Chiranjeevi's selfie with his son in law Kalyan Sankranti special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs