Advertisement
Google Ads BL

హీనా ఆశ పడితే శిల్పా కొట్టింది..!


బిగ్‌బాస్‌లో పార్టిసిపెంట్స్‌ తమ చీప్‌ పబ్లిసిటీ కోసం నానా రకాలుగా ట్రై చేస్తూ, ఈ షోద్వారా గుర్తింపు తెచ్చుకుని, వివాదాల ద్వారా వార్తల్లో నిలవాలని భావిస్తూ ఉంటారు. ఇక బిగ్‌ బాస్‌ హిందీ షోలో ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 11లో సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా నిర్వహించిన బిగ్‌బాస్‌ షోలు హీనాఖాన్‌ అనే నటి కూడా ఇలా బిగ్‌బాస్‌ హౌస్‌లో కావాల్సినంత వివాదాలు సృష్టించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. దాంతో పాటు ఈమె ఫైనల్‌ వరకు వెళ్లడంతో అందరూ ఈమె ఈ షోకి విన్నర్‌గా నిలుస్తుందని భావించారు. 

Advertisement
CJ Advs

కానీ వీక్షకులు మాత్రం ఈమెని కాస్త వ్యతిరేకించి. ఈమె ప్రత్యర్ధిగా ఫైనల్‌ బరిలోకి దిగిన శిల్పాషిండేని బిగ్‌బాస్‌ సీజన్‌ 11కి విన్నర్‌గా నిలిపారు. విన్నర్‌గా నిలిచిన శిల్పాషిండేకి సల్మన్‌ఖాన్‌ ట్రోఫీని అందించాడు. మహారాష్ట్రలోని లోనావాలాలో 19, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిగ్‌బాస్‌ హౌస్‌లో 90కెమెరాల మధ్య వీరి పోటీ మహారంజుగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ షో సాగింది. 

ఈ షో గ్రాండ్‌ ఫినాలేకి మరో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. మరి సినిమా అవకాశాలు రన్నరప్‌గా నిలిచిన హీనాఖాన్‌ని వరిస్తాయా? విజేతగా నిలిచిన శిల్పాషిండేని వరిస్తాయా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే...!

Shilpa Shinde on winning Bigg Boss 11:

shilpa shinde is the Bigg Boss 11 Winner  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs