ఆమధ్య యాంకర్‌గా, పలు వేదికలకు హోస్ట్‌గా, బుల్లితెరపై రోజు తన సొంత నిర్మాణంలో షోలు, వాటిని నిర్వర్తిస్తూ సుమ ఎంతో బిజీగా ఉంటుంది. మరోవైపు ఆమె ఇంత బిజీలో కూడా రాజీవ్‌కనకాలకి భార్యగా, తన పిల్లలకు తల్లిగా, అత్తమామలకి మంచి కోడలిగా, మరోవైపు తన బిజీ ప్రొఫెషన్‌లో కూడా బిజీగా ఉంటూనే అన్నిపాత్రలకి న్యాయం చేస్తుందని, ఆమెలా తాను అన్నింటికీ ఒకేసారి న్యాయం చేయలేకపోతున్నానని సుమ క్లోజ్ ఫ్రెండ్ ఝూన్సీతో పాటు సుమని తెలిసిన వారందరు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
ఈ ఫ్యామిలీలో బాగా సంపాదించేది కూడా కేవలం సుమనే అన్న విషయం తెలిసిందే. మలయాళీ అయినా కూడా తెలుగు ఎలా స్వచ్చంగా మాట్లాడుతుందో.. అచ్చమైన తెలుగమ్మాయిలా వెండితెరపై నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఈ మధ్య సింగర్‌గా కూడా రాణించింది ఈ అమ్మకుట్టి. ఇక ఈమె తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి తనదైన శైలిలో హడావుడి చేసింది. నేను పులిహోర చేస్తున్నాను. అందులో చింతపండు పులిహోర, దిస్ ఈజ్ గుజ్జు. దిస్ ఈజ్ పులిహోర.. ఎవరైనా తినడానికి వస్తున్నారా ఇవాళా? అంటూ హడావుడి చేస్తూ ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
తాను పులిహోరతో పాటు మరెన్నో చేస్తున్నానని, మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారని సుమ అడిగింది. చివరలో హ్యాపీ సంక్రాంతి అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇలా పులిహోర వైనంతో తాను బుల్లితెర మీదనే కాదు.. ఇంట్లో కూడా ఎంత సరదాగా ఉంటానో ఈ వీడియో ద్వారా ఆమె అందరికీ చూపించింది.