Advertisement
Google Ads BL

రీమేక్ చిత్రాలు నై.. నై..: బాలయ్య!!


'అన్నదమ్ముల అనుబంధం, మంగమ్మగారి మనువడు, ముద్దుల మావయ్య, లక్ష్మీ నరసింహ' చిత్రాలు నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మంచి బాక్సాఫీస్ విజయాల్ని సాధించటమే కాక వీటిల్లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'ముద్దుల మామయ్య' చిత్రం బాలయ్యకి తొలి ఇండస్ట్రీ హిట్ అందించిన చిత్రంగా నిలిచింది. కాగా ఈ చిత్రాలన్నీ ఇతర భాషల నుంచి ముఖ్యంగా తమిళంలో బాగా ఆడిన చిత్రాల రీమేక్ లే. అయితే ఇప్పుడు మాత్రం బాలయ్య రీమేక్ లపై చాలా విముఖంగా వున్నాడు. ఈ విషయం ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే బయటపెట్టారు.

Advertisement
CJ Advs

మిక్స్డ్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ మాస్ ప్రేక్షకులని మెప్పించే అంశాలతో కూడుకున్న 'జై సింహా' చిత్రం బి, సి, సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా సినిమా క్రేజ్ మరింత పెంచటానికి బాలయ్య ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో కే.ఎస్.రవికుమార్ తో కొంతకాలం క్రితమే పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ వదులుకోవటంపై అడిగిన ప్రశ్నకి సమాధానంగా రవికుమార్ అంతకు ముందు తనని సంప్రదించింది ఒక తమిళ చిత్ర రీమేక్ ప్రాజెక్టు కావటంతో, రీమేక్ లు వద్దనుకుంటున్న తాను ఆ ప్రాజెక్ట్ ని తిరస్కరించానని, ఇంతకాలానికి ఆయన దర్శకత్వంలో 'జై సింహా' రూపంలో పనిచేసే అవకాశం దక్కిందని చెప్పారు.

బాలయ్య కెరీర్ లో హిట్ చిత్రంగా నిలిచిన సామి రీమేక్ 'లక్ష్మీ నరసింహ' అనంతరం ఇప్పుడు తమిళంలో 'సామి 2' తెరకెక్కుతుంది. మరి బాలయ్య స్టేట్మెంట్ తో 'సామి 2' ఎంత పెద్ద విజయం అందుకున్నా బాలయ్య చేయరని డిసైడ్ ఐపోవచ్చేమో...

Not interested in doing remakes: Balakrishna:

Balayya Shocking Comments On Jai Simha Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs