Advertisement
Google Ads BL

గణతంత్ర దినోత్సవంకి థియేటర్స్ సమస్య..!


సంకాంతి పండుగకి ముందుగా వచ్చిన రిలీజ్ ప్రకటనలలో 'టచ్ చేసి చూడు' తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా వున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న చిత్రాలకి థియేటర్స్ సర్దుబాటు పంపిణీదారులకి పెద్ద తలనొప్పిగా నిలవటంతో కొన్ని చిత్రాల థియేటర్స్ కొరత కారణంగా విడుదలలు వాయిదా వేసుకున్నాయి. కాగా ఇప్పటికే సంక్రాంతి పండుగకి రావాల్సిన చిత్రాలు వచ్చి ఫలితాలు ఖరారు కావటంతో ఈ నెల 25 మరియు 26 తేదీలలో విడుదలకి సిద్దమవుతున్న చిత్రాల థియేటర్స్ సర్దుబాట్లు షురూ అయిపోయాయి.

Advertisement
CJ Advs

సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం 'పద్మావత్' తెలుగు వెర్షన్ కూడా 25 న విడుదల కానుంది. యూ.వి.క్రియేషన్స్ వారి నిర్మాణంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా చేసిన 'భాగమతి', మంజుల ఘట్టమనేని డైరెక్షనల్ డెబ్యూ 'మనసుకి నచ్చింది', మంచు విష్ణు కథానాయకుడిగా 'ఆచారి అమెరికా యాత్ర' తో పాటు ఇప్పటికే తమిళ సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకున్న 'టిక్ టిక్ టిక్' తెలుగు వెర్షన్ కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భముగా విడుదల కానుండటంతో మరొకసారి లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ చిత్రాల మధ్య పోటీ తప్పేలా లేదు.

Republic Day Release Movies List:

Theaters Issue to Republic Day Release Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs