Advertisement
Google Ads BL

చిరు కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు...!


ఈమధ్య ఇద్దరు మన సీనియర్‌ స్టార్స్‌ మీసాలు, గడ్డాలు తీసేసి క్లీన్‌షేవ్‌లో కనిపించారు. నాగార్జున రాజుగారిగది2 ప్రమోషన్స్‌లోనే కాదు నాగచైతన్య పెళ్లిలో కూడా మీసాలు లేకుండా కనిపించాడు. దేనికి అంటే స్పెషల్‌ ఏమీ లేదు. జస్ట్‌ అంతే అని చెప్పాడు. కానీ త్వరలో ఆయన మోహన్‌లాల్‌ తీసే 'రాండామూజం'లోని మహాభారతానికి చెందిన ఓ పాత్ర లుక్‌ కోసమే అయన అలా తయారయ్యాడని వార్తలు వచ్చాయి. మీసపుకట్టే అందంగా నాగార్జున గ్లామర్‌లో కీలక పాత్రను పోషించింది. అంతకు ముందు ఎన్నడూ నాగార్జున మీసాలు తీసేసి కనిపించింది లేదు. చివరకు అన్నమయ్య చిత్రంలో కూడా ఆయన మీసాలతోనే కనిపించాడు.

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా చిరంజీవి క్లీన్‌షేవ్‌లో దర్శనమిస్తున్నాడు. నాడెప్పుడో వచ్చిన 'చంటబ్బాయ్‌' కోసం ఆయన కొద్ది నిమిషాలు కనిపించేందుకు మీసాలు తీసి వేశాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడా ఇలా కనిపించలేదు. కానీ తాజాగా ఓ సినిమా వేడుకలో ఆయన ఇలా కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇక ఆయన ప్రస్తుతం తన 151వ చిత్రంగా హిస్టారికల్‌ మూవీగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ 'సై..రా.. నరసింహారెడ్డి' చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన గుబురు గడ్డాలు, మీసాలలో కనిపించాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి అయింది. రెండో షెడ్యూల్‌ త్వరలో పొలాచ్చిలో ప్రారంభం కానుంది.

ఇక ఈయన ఈ చిత్రం గ్రాఫిక్స్‌ ఇమేజెస్‌ కోసమే ఇలా మారాడని వార్తలువస్తున్నాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా ప్రజలందరూ, సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో వెలుగొందిని శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక నాగ్‌, చిరంజీవిల క్లీన్‌షేవ్‌ గెటప్‌లను కాస్త జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. ఈ గెటప్స్‌లో వారి వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి..!

Megastar Chiranjeevi New Look in Clean Shave!:

Chiranjeevi, who is currently shooting Sye Raa turned into a new look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs