Advertisement
Google Ads BL

కోడలి అల్లరి చూసి మురిసిపోతున్న మామ!


గతేడాది నాగార్జునకు పలు తీపి గుర్తులను అందించింది. ఆయన కుమారుడైన నాగచైతన్య-సమంతల వివాహం, మరోవైపు నాగచైతన్య, అఖిల్‌ సినిమాలు ఓకే అనిపించడంతో ఆయన కాస్త స్థిమితపడ్డాడు. అయితే అఖిల్‌ రెండో చిత్రంతో 'వస్తున్నాం.. బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం' అని నాగ్‌ చెప్పాడు. ఈ విషయంలో ఆయన మాట అనుకున్న స్థాయిలో నెరవేరకపోయినా కూడా కమర్షియల్‌ సక్సెస్‌, కలెక్షన్లు వంటివి పట్టించుకోకుండా ఉంటే అఖిల్‌ కెరీర్‌కి 'అఖిల్‌' ఇచ్చిన దెబ్బ నుంచి 'హలో' కాస్త ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

టాక్‌ బాగానే వచ్చినా కూడా 'మనసంతా నువ్వే' చిత్రానికి ఇది హైటెక్‌ వర్షన్‌ అనే టాక్‌ వచ్చినా కూడా సమ్‌థింగ్‌ స్పెషల్‌, డీసెంట్‌ మూవీగా ఓకే అనిపించింది. ఇక తన ఇంటికి కోడలు వచ్చిన తర్వాత మొదటి సంక్రాంతి పండుగ కావడంతో అక్కినేని ఫ్యామిలీ సంతోషంగానే ఉంది. ఈ మొదటి సంక్రాంతిని ఆయన ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు? అనే ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇస్తూ, పిల్లలు జీవితంంలో సెటిల్‌ అయితే వచ్చే ఆనందం ఎంతో ఉంటుంది. గత ఏడాది నా కుమారులిద్దరు కెరీర్‌ పరంగా స్థిరపడ్డారు. ఇక ఈ అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాపించిన 42 వసంతాలు సందర్భంగా మా స్టూడియోలోని వర్కర్లతో పాటు అందరికీ సమంత భోజనాలు తయారు చేసింది. అందరితో కలిసి ఎంతో ఆనందంగా మా కోడలు వచ్చిన మొదటి సంక్రాంతిని బాగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా సమంత 'మై హజ్బెండ్‌ ఈజ్‌ ది బెస్ట్‌' అనగానే మేమంతా షాక్‌ తిన్నాం. ఏం 'మా భార్యలకు మేమంతా మంచి భర్తలం కామా?' అని ప్రశ్నిస్తే సమంత మాత్రం 'లేదు.. మై హజ్జెండ్‌ ఈజ్‌ది బెస్టెస్ట్' అని గడుసుగా సమాధానం ఇచ్చింది.. అంటూ తన కోడలి మాటలను ఎంతో మురిపెంగా చెప్పుకుంటున్నారు మామగారు. 

మరి ఈ ఏడాది ఆయన తాతగారై బుల్లి అక్కినేని వారసుడు ఈ ఏడాది ఆయన ఫ్యామిలీలో జాయిన్‌ అవుతాడని అక్కినేని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. 2017లో మామగారిగా హోదా సాధించిన నాగార్జున 2018లో తాతగారిలా తన హోదాలో పదోన్నతి పొందుతాడని ఆశిద్దాం...! 

Nagarjuna Says How They Celebrates Sankranthi:

Nagarjuna Happy with Chaitu and Samantha Releation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs