Advertisement

ఫ్లాప్‌ చిత్రం ఎక్కడైనా ఫ్లాపే! రాస్కోరా సాంబ!!


రిక్షావాడికైనా, కోటీశ్వరుడికైనా ఎమోషన్స్‌ ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ఇవి దేశాలు మారినా కూడా మారవు. కొన్ని యూనివర్శల్‌ ఎమోషన్స్‌ అనేవి మానవులందరిలో ఒకే విధంగా ఉంటాయి. తిండి, నిద్ర, సెక్స్‌, ఆకలి. భయం, ఫీలింగ్స్‌ కామన్‌గానే ఉంటాయని గతంలోనే ప్రూవ్‌ అయింది. ఇక ఫ్రెంచ్‌ చిత్రంగా వచ్చిన 'లార్గో వించ్‌'కి కాపీగా 'అజ్ఞాతవాసి' వచ్చి నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి రోజు 40కోట్ల వరకు షేర్‌ వసూలు చేస్తే రెండోరోజున కేవలం 5కోట్లు మాత్రమే రాబట్టడంతో ఫలితం తేలిపోయింది. మరోవైపు ఈ చిత్రంలో వెంకటేష్‌ నటించిన సీన్స్‌ని యాడ్‌ చేశారు. ఈ విషయం గురించి చెప్పాలంటే 'ఉప్మా బాగాలేదని భార్యకి నో చెబితే.. ఆవిడ అదే ఉప్మాపైన రెండు జీడిపప్పులు పెట్టి ఇప్పుడు బాగుంటుంది అన్నట్లు' ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. 

Advertisement

ఫ్లాప్‌ చిత్రానికి ఈ అదనపు ఆకర్షణలను చూస్తుంటే ధర తక్కువగా ఉండే బీడీకి పొగ ఎక్కువ... ఫ్లాప్‌ చిత్రానికి హంగులెక్కువ అని చెప్పాలి. ఇక ఈ ఫ్రెంచ్‌యాక్షన్‌ మూవీ విషయంలో మాత్రం తమిళస్టార్‌ విజయ్‌ది అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్రెంచ్‌ చిత్రాన్ని మొదట గౌతమ్‌మీనన్‌ రీమేక్‌ చేయాలని భావించాడట. స్క్రిప్ట్‌ని తయారుచేసి మరీ విజయ్‌ చేత ఓకే చేయించుకుని, టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల కూడా చేశాడు. కానీ అదృష్టవశాత్తు ఈ చిత్రం ఆగిపోయింది. మరోవైపు ఇదే కథతో దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'దమ్ము' ఫార్ములానే ఈ చిత్రం కూడా. 

ఇక ఈ చిత్రం ఒరిజినల్‌ వెర్షన్‌ కూడా ఆర్దికంగా హిట్‌ కాలేదు. సో.. ఇలాంటి బ్యాడ్‌కాన్సెప్ట్‌ లైన్‌ని అనుకున్నా కూడా మూలాన్ని తీసుకుని తమదైన శైలిలో సినిమాలు తీస్తేనే ఎక్కడైనా హిట్టు అవుతాయి. ఎందుకంటే 10లక్షలు పెట్టి జెరాక్స్‌ మిషన్‌ని కొన్నా కూడా అది విదేశమైనా, స్వదేశమైనా దాని నుంచి జిరాక్స్‌కాపీనే వస్తుంది .. అంతేగానీ పదిలక్షలు ఖరీదు అని ఒరిజినల్‌ రాదు కదా...! నోట్ల ప్రింటింగ్‌ మిషన్‌ని తీసుకుని దొంగనోట్లు ముద్రించినా అవి దొంగ నోట్లే అవుతాయి కానీ అసలు నోట్లు ఎన్నటికీ కాలేవు....! 

Netizes applied Trivikram Mark Punches on Agnathavasi:

Agnathavasi Original Version Largo Winch also Flop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement