Advertisement
Google Ads BL

మిల్కీ బ్యూటీకి, డైరెక్టర్ కి మధ్య గొడవలంట!!


మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ దశాబ్ద కాలం పైమాటే కానీ ఆమె ఖాతాలో ఉన్న విజయాలు మాత్రం అరచేతి వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. స్టార్ హీరోస్ సరసన నటించినప్పటికీ కెమరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బద్రీనాధ్, ఊసరవెల్లి, రెబల్ వంటి డిజాస్టర్ సినిమాలనే తన ఖాతాలో వేసుకోగలిగింది తమన్నా. అనుకోకుండా దక్కిన బాహుబలి అవకాశంతో పెద్దగా గుర్తింపు దక్కకపోయినా భారీ విజయం వరించింది మిల్కీ బ్యూటీకి. ఇంత కాలానికి తనకి గుర్తింపు దక్కే ప్రాజెక్ట్ ప్రస్తుతం సెట్స్ పై ఉండగా అది కూడా సాఫీగా సాగనివ్వటం లేదట తమన్నా.

Advertisement
CJ Advs

బాలీవుడ్ లో ప్రతిభావంతురాలైన కథానాయిక కంగనా రనౌత్ కెరీర్ బూస్ట్ అప్ చిత్రంగా అభివర్ణించే క్వీన్ చిత్ర రీమేక్ దక్షిణాది భాషలన్నిటిలో తెరకెక్కుతుండగా తెలుగులో తమన్నా అవకాశం దక్కించుకుంది. తెలుగు మరియు మళయాళ భాషలకి దర్శకత్వ బాధ్యతలు మోస్తున్న నీలకంఠ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. కాగా తమన్నా సెట్స్ లో దర్శకుడికి పూర్తి సహకారం అందించక ఇబ్బందులకు గురి చేస్తుండటంతో దర్శకుడికి తమన్నాకి మధ్య చెలరేగిన వివాదం చివరికి నీలకంఠ తెలుగు రీమేక్ నుంచి నిష్క్రమించే స్థాయికి చేరిందట. అయితే మంజీమా మోహన్ కథానాయికగా తెరకెక్కుతున్న మళయాళ వెర్షన్ కి దర్శకుడిగా కొనసాగుతున్న నీలకంఠకి,  తమన్నాకి మధ్య నిర్మాతలు రాజీ కుదిర్చి తిరిగి ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారా లేక మరో దర్శకుడితో చిత్రీకరణ కొనసాగిస్తారా చూడాలి.

Disputes between the director Neelakanta and Tamanna:

Director Out From Queen Remake, Because Of Tamannaah?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs