Advertisement
Google Ads BL

కత్తి రివ్యూపై ఇలాంటి కామెంట్స్ అవసరమా?


మొత్తానికి సంక్రాంతి సీజన్‌లో ఎదురు చూసిన బడా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పవన్‌-త్రివిమ్రక్‌ల 'అజ్ఞాతవాసి', బాలయ్య-కె.యస్‌.రవికుమార్‌ల 'జై సింహా', సూర్యకి ఎంతో కీలకమైన 'గ్యాంగ్‌' చూసిన తర్వాత వినిపిస్తున్న నిజమైన టాక్‌ ఏమిటంటే.. సంక్రాంతి విన్నర్‌ ఎవడు బావా? అని అడిగితే, మూడు సినిమాలను వదలకుండా చూసిన పిచ్చి ప్రేక్షకుడే నిజమైన విన్నర్‌ తప్ప ఈ రేసులో ఎవ్వరూ విజయం సాధించలేదనేది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా ఇదే అభిప్రాయాన్ని తెలుపుతూ... మరీ ముఖ్యంగా ఓ నెటిజన్‌ సెటైరికల్‌ బౌన్సర్‌ వేశాడు. ఇది.. నిజమే. ఈ సంక్రాంతికి వచ్చిన 'అజ్ఞాతవాసి, జైసింహా'ల కంటే కాస్త 'గ్యాంగ్‌' మాత్రమే ఫర్వాలేదనిపిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక 'రంగుల రాట్నం' మాత్రమే మిగిలి ఉంది. 'అజ్ఞాతవాసి' విషయంలో కత్తి మహేష్‌ ఎలా స్పందించాడో, 'జైసింహా' విషయంలో కూడా అలాగే స్పందించాడు. 1980ల నాటి కథ, 1990ల నాటి కథనం, అర్ధంపర్దం లేని సీన్స్‌, ఓవర్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ ఇలా ఈ చిత్రం సాగింది. జనాలకు బెల్టుతోనో, షూ లేస్‌లతోనో, జిప్‌లు ఊడదీస్తూ, పెట్టుకోవడంలోనో, లేక కుర్చీపై కాలు పెట్టి స్టైల్‌గా కాలు ఊపినంత మాత్రాన హీరోయిజం పండుతుందని భావిస్తున్న దర్శక నిర్మాతల, హీరోలను అభిమానులు, ప్రేక్షకదేవుళ్లు ఇంకా భరిస్తుండటం మన తెలుగు స్టార్స్‌కి, వారి వీరాభిమానులకే సాధ్యమనిపిస్తోంది. ఈ విషయంలో తెలుగు సినిమా ప్రేక్షక దేవుళ్ల సహనానికి, ఇంకా ఆయా హీరోల సినిమాలపై నమ్మకాలు పెట్టుకుంటున్న వారికి శిరస్సువంచి పాదాభివందనం చేయాల్సిందే. 

ఇక 'అజ్ఞాతవాసి' నెగెటివ్ టాక్‌తో సంబరపడిన బాలయ్య అభిమానులు, తమచిత్రం కూడా అదే కోవలోకి రావడం ఓర్వలేక సహనం కోల్పోతున్నారేమో అనిపిస్తోంది. పవన్‌ కాబట్టి 'కత్తిమహేష్‌'ని వదిలాడు. ఆయన ఫ్యాన్స్‌ కాబట్టి మౌనంగా ఉన్నారు. అదే బాలయ్యతో ఆయన అభిమానులతో పెట్టుకుంటే అంతు తేలుస్తామని బెదిరిస్తున్న వారిని చూస్తే జాలి తప్ప ఇంకేమీ కలగదు. టికెట్‌ కొని సినిమా చూసిన ప్రేక్షకులకు అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పేహక్కు కూడా లేదా? ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. సినీ విశ్లేషకుడు కూడా కామన్‌ ప్రేక్షకుడిలానే సినిమా చూసి రివ్యూ ఇస్తాడనేది వాస్తవం. ఈ విషయంలో ఇటు పవన్‌ ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌ కలిసి ఏకంగా దమ్ముంటే సినిమా థియేటర్ల వద్దకు వచ్చి రివ్యూ ఇవ్వమని బెడిరించడం మానుకోవాలి. మీకు నచ్చితే బాగుందని మీరు ప్రచారం చేసుకోండి. కానీ మీకు నచ్చిందే అందరికీ నచ్చాలనే భావన మాత్రం తప్పు. 

balayya fans warning to kathi mahesh:

kathi mahesh jai simha review, balayya fans fired
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs