Advertisement
Google Ads BL

ఆది ఎంతగా డబ్బాలు కొట్టినా సీన్‌ లేదక్కడ!


తాజాగా విడుదలైన పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌ లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. భారీ అంచనాల నేపధ్యంలో యంగ్‌ హీరోలతో పాటు పలువురు తాము ఏదేశంలో ఏప్రాంతంలో ఉన్నా కూడా తమ సమీప థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేస్తున్నారు. ఏపీ మంత్రి, బిజెపి నాయకుడైన మాణిక్యాలరావు కూడా ఈ చిత్రాన్ని మొదటి షో తాడేపల్లి గూడెంలోని థియటర్‌లో వీక్షించి, పవన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ చిత్రం విడుదల సందర్భంగా నెల్లూరులో ఓ పాటి రచ్చే జరిగింది. నిజమైన పవన్‌ ఫ్యాన్స్‌కి టిక్కెట్లు ఇవ్వకుండా, ఎవరికో ఇచ్చారని పవన్‌ అభిమానులు నానా రచ్చ చేశారు. డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబ్యూటర్లు బ్లాక్‌మార్కెట్‌ని ప్రోత్సహిస్తూ నిజమైన అభిమానులకు టిక్కెట్లు దొరకకుండా చేశారని పోలీసు కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. దాంతో ఈ విషయంలో రాజకీయనాయకులు, పార్టీల ప్రముఖులు, ఎమ్మెల్యేలు ఇందులో తలదూర్చారు. చివరకు డిఎస్పీ రంగంలోకి దిగాడు. రెండో రోజు నుంచి థియేటర్ల యాజమాన్యాలు సగం టిక్కెట్లను ఫ్యాన్స్‌కే ఇవ్వాలని, మిగిలిన 50శాతం టిక్కెట్స్‌ బహిరంగంగా కౌంటర్‌లో అమ్ముకోవాలనే మద్యవర్తిత్వం జరిగింది. మరోవైపు సినిమాకి బాడ్‌ టాక్‌ రావడం, రివ్యూలు ఏకి పారేస్తుండటంతో రెండో రోజు నుంచే టిక్కెట్లు సులభంగా లభిస్తున్నాయి. దాంతో కొందరు ఇప్పుడు కావాలంటే పవన్‌ ఫ్యాన్స్‌కు ఈ చిత్రానికి ఎన్ని థియేటర్లు, ఎన్ని టిక్కెట్లు కావాలన్నా లభిస్తాయని సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈచిత్రం ఎంత సాదా సీదాగా సాగిందంటే పవన్‌ అభిమానులు కూడా కేకలు, విజల్స్‌ వేయడానికి ఏ సీన్‌లో అవకాశం లేకుండా ఫ్లాట్‌గా కొనసాగింది. ఈచిత్రంలో ఎవరైనా మెప్పించారంటే కేవలం ఆది పినిశెట్టి మాత్రమే. ఆది పినిశెట్టి ఎంట్రీ సీన్‌ నుంచి మరోసారి ఆయన తెరపై కనిపించినప్పుడు మాత్రమే విజిల్స్‌ వచ్చాయి. కానీ ఆయన పాత్రను కూడా కిచిడి చేసేసి సాధారణ విలన్‌గా గుర్తుంచుకొనే విధంగా మార్చేశారు. ఇక ఈ చిత్రం చూసిన హైపర్‌ ఆది మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని పవన్‌ కోసం 10సార్లు, త్రివిక్రమ్‌ కోసం మూడు సార్లు, కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, రావు రమేష్‌, మురళీశర్మ వంటి వారి కోసం వీలైనప్పుడల్లా చూడవచ్చని, ఇది బ్లాక్‌బస్టర్‌ అని అంటున్నాడు. దాంతో ఆయనపై కూడా సెటైర్లు పడుతున్నాయి.

మరోవైపు పవన్‌ అభిమానులు మాత్రం ఈ చిత్రం బాగా లేదనే రివ్యూల చోట్ల మండిపడుతున్నారు. కోట్లు పెట్టి ఏడాదికిపైగా ఎందరో కష్టపడి చిత్రం తీస్తే సినిమా బాగాలేదని చెప్పడానికి మీరెవ్వరు అని రెచ్చిపోతున్నారు. మరి నిర్మాతలు కోట్లు పెట్టిన చిత్రం కోసం నెలకి పదివేలు సంపాదించే సగటు అభిమాని వెయ్యి, రెండు వేలకి సినిమా చూసి, తన నెల జీతంలో ఏకంగా సగం దానికే కేటాయిస్తే మరి వాడికి అడిగే హక్కు ఉంటుంది కదా...! బాగా లేనప్పుడు మాటలు పడాల్సిందే. నిర్మాతల, యూనిట్‌ కష్టం వారిదైతే సామాన్య ప్రేక్షకుని డబ్బు, కష్టార్జితానికి కూడా అంతే విలువు ఉంటుంది. డబ్బులేమీ చెట్టకు కాయవు.. అని సమాధానం చెప్పాల్సిందే!

Hyper Aadhi Hype to Agnathavasi:

Hyper Aadhi Promotes Agnathavasi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs