మెగా ఫ్యామిలీ నుండి హీరోలు కుప్పలు తెప్పలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. మెగా స్టార్ అనే వృక్షం నుండి అనేకమంది హీరోలు పుట్టుకొచ్చారు. చిరంజీవి తమ్ముళ్లు, కొడుకులు, మేనల్లుళ్లు, ఆఖరికి తమ్ముడు కూతురు కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలబడాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు తాజాగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది. శ్రీజ భర్త కళ్యాణ్ కానుగంటి.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోయే మొదటి సినిమాను త్వరలోనే ప్రారంభించదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాకేశ్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్ర బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే నటనలో, డాన్స్ లలో శిక్షణ తీసుకుంటున్న కళ్యాణ్ తన మొదటి సినిమా కోసం పూర్తిగా సిద్దమయ్యాడు. ఇకపోతే సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు నటీనటుల ఎంపిక మీద అలాగే ఈ సినిమాకి పని చెయ్యబోయే టెక్నీషియన్స్ మీద దృష్టి సారించారు. అయితే కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే సినిమాలో కళ్యాణ్ కానుగంటి సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ అయ్యిదనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
లై సినిమాతో నితిన్ సరసన నటించి టాలీవుడ్ కి పరిచయమైన మేఘ ఆకాష్ ని కళ్యాణ్ కి జోడిగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు హీరోయిన్ మేఘ ఆకాష్ ఫైనల్ అని చెబుతున్న టీమ్ నుండి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటున్నారు. నితిన్ సరసన లై లో నటించిన మేఘ ఆకాష్ మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకుంది. తాజాగా మేఘ... నితిన్ తోనే తన రెండో సినిమా కూడా చేస్తుంది.