Advertisement
Google Ads BL

'అజ్ఞాతవాసి' పరిస్థితే అర్ధం కావట్లేదు!


పవన్‌ ఆ మధ్యకాలంలో వరుస ఫ్లాప్‌లతో ఉన్నాడు. 'జల్సా' మాత్రమే ఓకే అనిపించుకుంది. మరోవైపు 'తీన్‌మార్‌'తో పాటు ఆయన నటించిన 'పంజా', 'పులి', 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లు కూడా తీవ్ర డిజాస్టర్స్‌గా మిగిలాయి. కానీ అంతకు ముందు ఆ తర్వాత వచ్చిన 'గబ్బర్‌సింగ్‌, అత్తారింటికిదారేది' చిత్రాల ద్వారా ఆయన అభిమానులు ప్రేక్షకులు సంతృప్తి ఫీలయ్యారు. పవన్‌ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే పైరసీలు కూడా ఏమి చేయలేవని ఆ చిత్రాలు నిరూపించాయి. మరోవైపు 'కాటమరాయుడు' చిత్రం తమిళ 'వీరం'కి రీమేక్‌ కావడం, ఆల్‌రెడీ డబ్‌ అయిన చిత్రాన్ని పవన్‌ చేసినా ఈ చిత్రం ఓపెనింగ్స్‌ మాత్రం అదుర్స్‌ అనిపించింది. దాంతో బ్యాడ్‌టాక్‌ తెచ్చుకుని కూడా కేవలం వీకెండ్‌, మొదటి వారంలోపు 50కోట్ల మార్క్‌ని దాటడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 'కాటమరాయుడు' చిత్రం మిగిలిన న్యూట్రల్‌ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించలేకపోయినా అందులో ఆయన ఫ్యాన్స్‌కి కావాల్సిన హంగులు ఉండటంతోనే అది సాధ్యమైంది. 

Advertisement
CJ Advs

మరోవైపు పవన్‌తో పోటీ పడే మహేష్‌ చిత్రాలైన 'బ్రహ్మోత్సవం, స్పైడర్‌'లు నెగెటివ్‌ టాక్‌ రావడంంతో కలెక్షన్లు సాధించలేదు. కానీ 'కాటమరాయుడు'కి నెగెటివ్‌ టాక్‌ వచ్చినా 50కోట్లు దాటడంతో పవన్‌ సినిమా అంటే జయాపజయాలకు అతీతమని కొందరు భావించారు. సినిమా ఎలా ఉన్న 50కోట్లు గ్యారంటీ అన్నారు. కానీ 'అజ్ఞాతవాసి' పరిస్థితి చూస్తే దీనికి పవన్‌ ఏమీ అతీతుడు కాదని నిరూపితమైంది. త్రివిక్రమ్‌-పవన్‌ల హ్యాట్రిక్‌ చిత్రం, ఇక ఎన్నికల ముందర ఇది పవన్‌ చివరి చిత్రం అనేవి కూడా ఈ సినిమాని కాపాడలేవని అర్ధమవుతోంది. మొదటి వీకెండ్‌కి ఆల్‌రెడీ టిక్కెట్లు కొన్నవారి సంగతేమో గానీ ఇప్పుడు ఈ చిత్రం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కూడా రెండో రోజుకే లభించడం చూస్తుంటే ఇది డిజాస్టర్‌ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం కనీసం సంక్రాంతి సెలవుల దాకా అయినా నెట్టుకొస్తుందా? లేదా? అనేది బాలయ్య 'జై సింహా' మీద ఆధారపడి ఉంది. 

'అజ్ఞాతవాసి'తో పోలిస్తే 'జై సింహా'కి హైప్‌ తక్కువగా ఉండటం, ట్రైలర్‌ వంటి వాటికి పెద్దగా రెస్పాన్స్‌ రాకపోవడంతో ఏమాత్రం 'జైసింహా' కి పాజిటివ్‌ టాక్‌ వచ్చినా 'అజ్ఞాతవాసి' పరిస్థితి దీనంగా మారుతుంది. మరోవైపు ఇంతకు ముందు పండలకి పోటీగా సైలెంట్‌ గా వచ్చి హిట్లు కొట్టిన శర్వానంద్‌లాగా ఈ సారి రాజ్‌తరుణ్‌ 'రంగుల రాట్నం'తో వస్తున్నాడు. నాగార్జున నిర్మిస్తున్న చిత్రం కావడంతో పాజిటివ్‌ బజే ఉంది. మరి ఈ సంక్రాంతిని ఎవరు సరిగా క్యాష్‌ చేసుకుంటారో చూడాలి? మరోవైపు బిజినెస్‌, బడ్జెట్‌ పరంగా బాలయ్య 'జై సింహా' పరిస్థితి మరీ ఓవర్‌ కాదు. దాంతో కనీసం ఓకే అని టాక్‌ వచ్చినా దీనికి లాభాలు రావడం ఖాయంగానే కనిపిస్తోంది. 

Agnathavasi Talk Very weak at Box Office:

Agnathavasi Future on Jai Simha Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs