Advertisement
Google Ads BL

త్రిష ఎందుకు అలా ప్రవర్తిస్తోంది?


15ఏళ్లుగా సీనియర్‌ స్టార్స్‌ నుంచి సిద్దార్ద్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి వారితో కూడా కలిసి నటించిన త్రిష సినిమా సెట్స్‌లో మాత్రం బాగానే ఉంటుందని అందరూ చెబుతారు. బయట ఎలాంటి వివాదాలు ఉన్నా ఓ సినిమా ఒప్పుకుంటే ఆమె ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సాఫీగా తన పని తాను చేస్తుందని అంటారు. ఆ మంచి పేరుతోనే ఈమెకి ఇంత లాంగ్‌ కెరీర్‌ సాధ్యమైందని కూడా అందరూ చెబుతారు. ఇక పెళ్లి పీటల దాకా ఎక్కి ఆగిపోవడంతో ఇక ఈమె పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బౌన్స్‌ బ్యాక్‌ అయిన ఆమె ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగా ఉంది.

Advertisement
CJ Advs

ఇక నాడు ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా నిలిచిన 'సామి' చిత్రంకి సీక్వెల్‌గా హరి దర్శకత్వంలోనే విక్రమ్‌ హీరోగా రూపొందుతున్న 'సామి 2'కి ఆమె ఓకే చెప్పింది. ఇందులో మరో హీరయిన్‌గా కీర్తిసురేష్‌ నటిస్తోంది. కానీ ఈ చిత్రం షూటింగ్‌లో తనని పట్టించుకోకుండా అందరూ కీర్తిసురేష్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారని, తన పాత్రను కూడా పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకుండా చిత్రీకరిస్తున్నారు. నేను సీనియర్‌ నటిని అని ఆమె షూటింగ్‌ని బాయ్‌కాట్‌ చేసింది. తర్వాత నిర్మాతల మండలి తరపున సెక్రటరీ జ్ఞానవేల్‌రాజాతో పాటు ఆ చిత్ర నిర్మాతలు ఆమెతో సంప్రదింపుల కోసం ఆమె ఉంటున్న హోటల్‌కి వెళ్తే గంటలు గంటలు వెయిట్‌ చేయించి, వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయింది.

తాజాగా ఈమె తమ సినిమా షూటింగ్‌లో పాల్గొనకపోవడం వల్ల తమకు ఆర్ధికంగా ఎంతో నష్టం వచ్చిందని, ఆమె తన అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చినా, తమకు జరిగిన నష్టానికి పరహారం చెల్లించాలని నిర్మాతలు నడిగర్‌ సంఘంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ 'డోంట్‌ కేర్‌' అనే ఒక్క వాక్యాన్ని ట్వీట్‌ చేసి, తాను ఎవ్వరికీ భయపడేదిలేదని తేల్చిచెప్పడంతో ఇప్పుడు ఈ వివాదం మరింత పెద్దది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...!

Case file on Trisha in Kollywood:

Heroine Trisha in Troubles
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs