నిన్న రిలీజ్ అయిన 'అజ్ఞాతవాసి' ఫలితం కన్నా అందరిని ఎక్కువగా బాధిస్తున్న విషయం దర్శకుడు త్రివిక్రమ్ మేజిక్ పెన్ పరంగా, టేకింగ్ పరంగా మచ్చుకు కూడా కనిపించలేదు అనేది. 'ఖలేజా' సినిమా ఫ్లాప్ అయినా దాన్ని ఇష్టపడిన జనాలు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో క్లీన్ కామెడీ, అతి లేని కామెడీ, త్రివిక్రమ్ చెప్పే జీవన సత్యాలు. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా ప్రేక్షకుల మెప్పు మాత్రం పొందింది ఖలేజా. కానీ 'అజ్ఞాతవాసి'కి ఆలా కాదు.
'అజ్ఞాతవాసి' రిలీజ్ కు ముందు నుండే ఫ్రెంచ్ మూవీ కాపీ కొట్టి తీశారని ఆరోపణలు ఉన్నాయి. 'అజ్ఞాతవాసి' రిజల్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు భయం పట్టుకుంది. మొదటిసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ తో పాటు అందరికి ఒకటే కోరిక. 'అజ్ఞాతవాసి' సినిమా కాపీ కొట్టి తీసినట్టు ఎన్టీఆర్ కు అలా చేయొద్దని.. ఒరిజినల్ స్క్రిప్ట్ అయితే బాగుంటుందని...'అజ్ఞాతవాసి' సినిమా స్క్రిప్ట్ మీద నిర్లక్ష్యం చేసినట్టు ఈ సినిమాకు చేయొద్దని కోరుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్.
మొత్తానికి 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో మూవీకి వార్నింగ్ బెల్ గా మారింది. తాను ఏం రాసినా ఏం తీసినా చూస్తారు అనే త్రివిక్రమ్ లెక్కలు పూర్తిగా తప్పు అని ప్రేక్షకులు కొట్టి పడేశారు. మరోవైపు ఒక్క సినిమాతో త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరెక్టర్ ని తీసిపారేసినట్టు చేయకూడదని సోషల్ మీడియాలో సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు.