Advertisement
Google Ads BL

ఇంకొన్ని గంటల్లో బాలయ్యో, పవనో తేలిపోద్ది!


పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'. నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి నెగెటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలయ్య 'జై సింహా' సినిమాపై పడింది. ఈ సినిమా రేపు విడుదల కానుంది. 'జై సింహా'కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేసేస్తారు. ఎందుకంటే 'జై సింహా'కి పోటీగా మరో సినిమా లేదు.

Advertisement
CJ Advs

వాస్తవానికి 'జై సింహా'తో పాటు తమిళ్ హీరో సూర్య 'గ్యాంగ్', రాజ్ తరుణ్ నటించిన 'రంగులరాట్నం' 14న రిలీజ్ కానున్నాయి. అయితే ప్రధానంగా పోటీ మాత్రం 'అజ్ఞాతవాసి', 'జై సింహా' మధ్యే నడుస్తోంది. కాబట్టి సంక్రాంతి హీరో ఎవరో రేపు అంటే శుక్రవారం సాయంత్రానికల్లా తేలిపోతుంది. నిన్నటివరకు పెద్దగా బజ్ లేని 'జై సింహా'.... 'అజ్ఞాతవాసి' రిలీజ్ టాక్ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుని బాక్సాఫీసు బరి వద్ద 'అజ్ఞాతవాసి'ని చీల్చి చెండాడటానికి రెడీ అవుతుంది.

అందులో భాగంగానే 'జై సింహా' ప్రొమోషన్స్ ఇంకాస్త పెంచారు. స్వయంగా బాలయ్య రంగంలోకి దిగాడు. అటు సోషల్ మీడియాలో కూడా 'జై సింహా'ను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి హీరోయిన్ నయనతార, డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ ప్లస్ పాయింట్స్. సో రియల్ హీరో పవనా .. లేదా బాలయ్యా..అనేది మాత్రం మరికొన్ని గంటల్లోనే తెలియనుంది.

Agnathavasi Future on Jai Simha Result:

Balayya or Pawan Kalyan.. who is the winner?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs