నేటి రోజుల్లో సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం.. ఆ తర్వాత నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారని గ్రహించి, రిలీజ్ అయిన తర్వాత పలు సీన్స్‌ని కట్‌చేసి థియేటర్ ఎడిటింగ్ చేస్తున్నారు. కొందరైతే మూడు గంటలకుపైగా చిత్రాలను తీసి, అందులోంచి ఏ సీన్‌ని ఎడిట్ చేయడానికి ఒప్పుకోకుండా రిలీజ్ చేసి తర్వాత ఎడిట్ చేస్తున్నారు. మరి ఇంకొందరు తమ చిత్రాలలోని కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేసి, సినిమాకి సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత వాటిని యాడ్ చేస్తున్నారు.
అయితే సినిమాకి మంచి టాక్ వస్తే ఇది రిపీట్ రన్‌కి ఉపయోగపడుతుందేమో గానీ సినిమాకి నెగటివ్‌టాక్ వస్తే మాత్రం ఆ తర్వాత ఏమి యాడ్ చేసినా కూడా వాటిని ప్రేక్షకులు మరలా చూసే అవకాశాలు కనిపించడం లేదు. ఇక 'అజ్ఞాతవాసి' విషయానికి వస్తే ఇందులో విక్టరీ వెంకటేష్ నాలుగు నిమిషాల నిడివి ఉండే ఓ పాత్రను చేశాడని, దీనికి సంబంధించిన షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. అందుకే ఈ చిత్రం తొలిరోజున ఈ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్‌తో పాటు వెంకీ ప్యాన్స్ కూడా ఎంతో ఆసక్తితో చూశారు. 'గురు' చిత్రం తర్వాత వెంకీ మరలా స్క్రీన్‌పై కనిపించకపోవడంతో అందరూ ఆయన కోసం ఆశగా ఎదురు చూశారు.
కానీ ఇందులో వెంకీ కనిపించలేదు. దాంతో ఈ వార్తల్లో నిజం లేదని కొందరు భావిస్తుంటే మరికొందరు మాత్రం ఈ సీన్స్‌ని ఎడిట్ చేశారని, తర్వాత వాటిని కలుపుతారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఎన్నిసీన్స్ కలిపినా ఫలితం విషయంలో మాత్రం మార్పు వచ్చే అవకాశాలు ఉండవని టాక్ వినిపిస్తుండటం విశేషం.