Advertisement
Google Ads BL

'అజ్ఞాత‌వాసి'లా 'సాహో' కూడా కాపీయేనా?


బుధవారం భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాత‌వాసి' సినిమా ఓ ఫ్రెంచ్ మూవీకి ఫ్రీమేక్ గా తెరకెక్కింది.  ఆ ఫ్రెంచ్ ఫిలిం మేకర్స్ కి తెలియకుండానే త్రివిక్రమ్ ఈ మూవీని కాపీ కొట్టాడు. అయితే ఈ ఫ్రెంచ్ మూవీ రీమేక్ రైట్స్ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ - సిరీస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సంస్థకి 20 కోట్లు ఇచ్చి సెట్టిల్ చేశారనే టాక్ సోషల్ మీడియాలో భీభత్సంగా ప్రచారంలో ఉంది. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఈ అజ్ఞాతవాసి ఇష్యూ వల్ల మరో మూవీ టీమ్ జాగ్రత్తపడుతుంది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సాహో' సినిమా టీం ఇప్పుడు జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే సాహో సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ మూవీ నుంచి తీసుకున్నారు అనే టాక్ మొదటి నుండి ఉంది. ఇక ఇప్పుడు 'అజ్ఞాత‌వాసి'కి ఇలా భారీ డీల్ ద్వారా సమస్య పరిష్కారం అయ్యిందని తెలియగానే సాహో టీం ఆ సీన్స్ ను అధికారికంగా అయినా తీసుకుందాం.... లేకపోతే మళ్ళీ రీ షూట్ అయినా చేద్దాం అనే ఆలోచనలో ఉందంట.

మరి ఎంత భారీ బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించినా ఇలా చివరిలో కాపీ ఇష్యుస్ వలన అటు నిర్మాతలకు తడిసి మోపుడవ్వడమే కాదు... ఇటు సినిమా రిజల్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు 'అజ్ఞాత‌వాసి' ఇష్యూ వల్ల టాలీవుడ్ లో చాలా సినిమాలు జాగ్రత్త పడుతున్నాయి అని అంటున్నారు.

Saaho Team Alerts with Agnathavasi Copy Issues:

Agnathavasi A Lession to Saaho
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs