'పైసావసూల్' లో స్టెప్పే 'జైసింహా'లో కనిపిచండానికి కారణం గురించి బాలయ్య చెబుతూ, ఆ మూమెంట్‌ని అనుకోకుండా పెట్టాం. ముందుగా మరో మూమెంట్‌ని అనుకున్నాం. జానీ, బృందా మాస్టర్లు చూపించారు. కానీ అది ఆ పాటకు ఇమడలేదు. వెంటనే జానీ మాస్టర్ ఈ మూమెంట్ చేశారు. యూనిట్ మొత్తం చప్పట్లు కొట్టారు. ఇది 'పైసావసూల్'లో గుర్తిండిపోయే మూమెంట్. దాంతో అభిమానులను ఉత్సాహపరిచినట్లుగా ఉంటుందని కదా అని అదే స్టెప్‌ని పెట్టాం. ఇక నటాషాదోషి మూడోహీరోయిన్ పాత్రను చేసింది. నన్ను ప్రేమించి పెళ్లిచేసుకోలేకపోయిన పాత్ర అది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే పాత్ర. 'అమ్మకుట్టి' అనే పాట ఆ అమ్మాయితోనే చేశాను. ఇక హరిప్రియ పాత్ర ఎంతో ఇంట్రస్టింగ్. ఆ పాత్రను ఇప్పుడే బయటపెట్టకూడదు. ఆమెతో నాకు ఓ పెద్దసీన్ ఉంటుంది.
సాధారణంగా అలాంటి సీన్‌చేయాలన్నా, తీయాలన్నా ఒకరోజంతా పడుతుంది. కానీ నేను, హరిప్రియలు కేవలం ఉదయం 7 గంటల నుంచి ౧౦ గంటలలోపు పూర్తి చేశాం. ఆ అమ్మాయి అద్భుతంగా నటించింది. యూనిట్‌లోని అందరూ చూస్తుండిపోయారు. ఫొటోగ్రాఫర్ నుంచి లైట్‌బోయ్ వరకు అందరూ ఈ సీన్‌కి ఏడ్చేశారు. ఇక ఈ చిత్రంలో ఆ సీన్‌ఎంత అద్బుతంగా ఉంటుందో తెరపై చూడండి. ఈ సినిమా దర్శకుడు, కె.యస్.రవికుమార్, సినిమాటోగ్రాఫ్ రాంప్రసాద్ వంటి క్రమశిక్షణతో ఉండే వారితో పనిచేయడం నా అదృష్టం, వారు సినిమా ఎంత త్వరగా తీసి నిర్మాతలకు మేలు చేద్దామా? అనే ఆలోచిస్తారు.
మాతో చేసేవారందరికీ నిర్మాత శ్రేయస్సే ముఖ్యం. 'గౌతమీపుత్రశాతకర్ణి'ని 79 రోజుల్లో, 'పైసావసూల్'ని 78రోజుల్లో పూర్తి చేశాం. ఈ చిత్రాన్నికూడా కేవలం 90రోజుల్లో ఫినిష్‌చేశాం. ఇక ఇతర నటీనటులు తాము బాగా నటించామా? లేడా? అనేది మానిటర్‌లో చూసుకుంటారు. మాకు ఆ అలవాటు లేదు. బాగా నటించామా, లేదా అన్నది కెమెరా మెన్ ద్వారానే తెలుసుకుంటాం. నేను మానిటర్‌ని నమ్మను. కెమెరామెన్‌నే నమ్ముతాను. వారి స్పందనే నాకు ముఖ్యం అంటున్నాడు బాలయ్య.