పవన్‌కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు' అనే డైలాగ్ ఉంది. ఈ విషయం పవన్ మాటల్లో కాక చేతల్లో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ ఫ్యాన్స్-కత్తి మహేష్‌ల వ్యవహారంలో ఇద్దరి తప్పు కనిపిస్తోంది. ఇక కత్తిమహేష్ వంటి సాధారణ జర్నలిస్ట్‌కి తానేందుకు సమాధానం ఇవ్వాలి? ఆయనపై స్పందించి ఆయన్ను నేను మరింత సెలబ్రిటీని చేయడం ఏమిటి? అనే భావన పవన్‌లో ఉండి ఉండవచ్చు. అందులో కాస్త నిజం కూడా ఉంది.
కాగా పవన్ ఆ మధ్య తాను ఇంగ్లాండ్‌కి వెళ్లి అక్కడి విద్యార్ధులతో ముఖాముఖి సందర్భంగా ఓ విద్యార్ధి మీరు టిడిపిని సపోర్ట్ చేశారు కదా.. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కృష్ణానది పడవ సంఘటన జరిగింది. దీనికి మీరు కూడా బాద్యులే అని చెప్పిన మాట ఆలోచింపజేసిందని, దాంతోనే తాను కృష్ణానది పడవ ప్రమాదంలో మృత్యుల కుటుంబాల పరామర్శకు వచ్చానని పవన్ చెప్పాడు. ఇక తనకు ఇంగ్లాండ్‌లో ఉన్న ఈ బంగ్లాదేశీయుడైన స్నేహితుడు మంచి విలువైన సలహాలు ఇస్తాడని, తాను అలాంటి వాటిని స్వీకరిస్తానని తెలిపాడు. ఇక తాను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడినని, తన తండ్రి సామన్యమైన పోలీస్ కానిస్టేబుల్ అని, సామాన్యుల బాధ తనకి తెలుసునని చెబుతుంటాడు.
ఇలాంటి సందర్భంలో కత్తి మహేష్ విషయంలో పవన్ కాస్త చొరవ చూపి ఉండాల్సిందిగా అనిపిస్తోంది. కేవలం కత్తి మహేష్‌కే కాదు. ఎవరితోనూ అలా బిహేవ్ చేయవద్దని ఫ్యాన్స్‌కి ఒక్క పిలుపు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా...? అంటే పవన్‌కి విదేశాలలో ఉండే తెలివైన వారు... వారి మాటలే ఆలోచింపజేస్తాయి కానీ, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే విధంగా ఆయనకు మన తెలుగు వారు ఇచ్చే సలహాలు మాత్రం గిట్టవా? లేక అలాంటి సలహాలను తాను కేవలం తన తోటి తెలుగు వారి నుంచి నేర్చుకోవడం ఏమిటి? అనే చిన్నచూపా?
ఇక గతంలో పవన్ తన గన్ హ్యాండోవర్ చేసినప్పుడు, శ్రీజ బాబాయ్ నుంచి ప్రాణభయం ఉందని చెప్పినప్పుడు, కామన్‌మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టనప్పుడు. తాను ఉదయ్‌కిరణ్ నిశ్చితార్దం సమయంలో జర్నలిస్ట్‌ని కొట్టినప్పుడు, చివరకు ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వార్తలు వచ్చిన తర్వాత వెంటనే ఖండించకపోవడం వల్ల ఎన్ని అనర్ధాలు జరిగాయో పవన్‌కి మెగా కాంపౌండ్‌కే బాగా తెలుసు.