Advertisement
Google Ads BL

కత్తికి అడ్డంగా దొరికిన పవన్!!


ప్రస్తుతం క్రిటిక్ కత్తి మహేష్ కి పవన్ ఫాన్స్ కి మధ్యన ప్రత్యక్ష యుద్ధం జరుగుతుండగా... కత్తికి పవన్ కి పరోక్ష యుద్ధం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు, సినిమాల కన్నా ఎక్కువాగా హాట్ టాపిక్ అయ్యింది కత్తి మహేష్ ఇష్యునే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ సెలెబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తున్న కత్తికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్డంగా దొరికేసాడు. పవన్ ఏమిటి అడ్డంగా దొరకడం ఏమిటి అనుకుంటున్నారా... అదేనండి పవన్ నటించిన అజ్ఞాతవాసి ఈ రోజు బుధవారం ఎంతో హంగామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన  ఈసినిమా భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Advertisement
CJ Advs

అయితే క్రిటిక్ అయిన కత్తి మహేష్ అజ్ఞాతవాసిపై ట్విట్టర్ లో విరుచుకుపడాడ్డు. ప్రస్తుతం ఈ నెల 15  వరకు పవన్ ఫాన్స్ తో పాటు, కత్తి మహేష్ ని కూడా  కామ్ గా ఉండమన్న కోన వెంకట్ కి ఝలక్ ఇస్తూ కత్తికి పదును పెట్టిన కత్తి మహేష్ అజ్ఞాతవాసిని పొడిచి పొడిచి చంపేశాడు. సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. 

రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో)... అంటూ అజ్ఞాతవాసిపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ సాక్షిగా బయటపెట్టాడు.

మరి ఇప్పటివరకు అనేక విషయాల్లో పవన్ ని అడ్డంగా ఆడుకుంటున్న కత్తికి ఇప్పుడు అజ్ఞాతవాసి తో పవన్ మాత్రం అడ్డంగానే బుక్ అయ్యాడనే విషయం ఈ కత్తి ట్వీట్ తో క్లియర్ గా అర్ధమవుతుంది. మరి కత్తి మహేష్ రివ్యూ కి పవన్ ఫాన్స్ స్పందనేమిటో...?

Mahesh Kathi Comments on Agnathavasi:

Kathi Mahesh Review On Agnyaathavaasi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs