Advertisement
Google Ads BL

టాక్ అంతా ‘జై సింహా’ గురించే..!!


పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా క్రేజ్ ముందు బాలకృష్ణ 'జై సింహా' నిలబడలేకపోతున్నది అన్నది వాస్తవమే. అజ్ఞాతవాసి ముందు పెద్దగా హైప్ లేని జై సింహా కూడా తానేమి తక్కువకాదని... తమ ప్రమోషన్ తాము చేసుకుపోతున్నారు. ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ సినిమా మీద హైప్ పెంచేందుకు హడావిడి చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ కూడా మీడియా ఇంటర్వూస్ తో హడావిడి చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. నిన్నటికి నిన్న ప్రీ రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ ని కూడా విడుదల చేసింది జై సింహా యూనిట్. అయితే జై సింహా మొదటి ట్రైలర్ మాత్రం సో... సో... గా ఉంటే.. ప్రీ రిలీజ్ ట్రైలర్ మాత్రం బెటర్ గా వుంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్ని ఈ ట్రైలర్ లో కనిపించేసరికి బాలయ్య ఫ్యాన్స్ కాస్త యాక్టీవ్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఇకపోతే అజ్ఞాతవాసికి ఎంత హైప్ ఉన్నా కూడా రెండు రోజుల తర్వాత జై సింహా బాక్సాఫీసు వద్దకు రావడం కూడా జై సింహాకి కలిసొచ్చే అంశమే. కాకపోతే అజ్ఞాతవాసి హిట్ అనే టాక్ వస్తే జై సింహాకి ఓపెనింగ్స్  కొద్దిగా తగ్గుతాయి. అదే అజ్ఞాతవాసికి కాస్త డివైడ్ టాక్ వచ్చిందా జై సింహా కలెక్షన్స్ అదిరిపోతాయి. ఇక సూర్య కూడా గ్యాంగ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు జై సింహాకి పోటీగా దిగుతున్నప్పటికీ.. సూర్య సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం.. కూడా జై సింహాకి కలిసొచ్చే అంశం.

ఇక జై సింహా వచ్చిన రెండు రోజులకు భోగి రోజున రంగుల రాట్నంతో రాజ్ తరుణ్ రాబోతున్నాడు. నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి ఓ.. అన్నంత బజ్ లేదు. కారణం అనుకోకుండా సంక్రాంతి బరిలోకి రావడం.. ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ప్రేక్షకులు. మరి ఒకవేళ హిట్ అయినా కూడా జై సింహాకి మాస్ ఆదరణ బిసి సెంటర్స్ ఆదరణ గట్టిగా ఉంటుంది. అందుకే ఎటు చూసినా జై సింహాకి కలక్షన్స్ పరంగా కాస్త కలిసొచ్చే అంశంతో పాటు నయనతార, బాలయ్యలది హిట్ కాంబినేషన్ కావడం కూడా ఈ సినిమాకి మరో బలమైన క్రేజ్. మరి ఈ జై సింహాకి భారీగా ఓపెనింగ్స్ రాకపోయినా కూడా కలెక్షన్స్ కీలకమే. చూద్దాం ఈ సంక్రాంతికి బాలయ్య జై సింహా పరిస్థితి ఏమిటనేది.

Balayya Jai Simha in Trend:

Nandamuri Fans Waiting for the Jai simha Report..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs