Advertisement
Google Ads BL

సినిమాకి మూలం ఏమిటో చెప్పిన బాలయ్య!


నిజంగానే నేటి సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి వారు వయసు పెరుగుతున్నా కూడా వారు చూపిస్తున్న కమిట్‌మెంట్‌ చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. చిరంజీవి 'ఖైదీనెంబర్‌ 150'తో తన ఎనర్జీని చూపి, ఎంతో కష్టతరమైన 'సై..రా..నరసింహారెడ్డి'కోసం ఈ వయసులో కత్తిసాము, యుద్ద విద్యలు, గుర్రపు స్వారీ వంటివి నేర్చుకుంటుండటం చూస్తే ఓరా అనిపిస్తుంది. ఇక నాగార్జున ఈ వయసులో కూడా రామ్‌గోపాల్‌ వర్మ కోసం తన సిక్స్‌ప్యాక్‌ బాడీని చూపిస్తూ, కొత్త కొత్త కథలు పాత్రలతో ముందుకు సాగుతున్నాడు. ఇక వెంకీ కూడా అదే దోవలో ఉన్నాడు.

Advertisement
CJ Advs

ఇక బాలయ్య కూడా కేవలం తన వందో చిత్రం ఏమిటి? అనే విషయంలో కాస్త గ్యాప్‌ ఇచ్చాడే గానీ ఆయన ఎప్పుడు నిర్మాతల, దర్శకుల హీరోనే. కేవలం మూడు నెలల్లో సినిమాలను పూర్తి చేసే ఆయన కమిట్‌మెంట్‌, యాక్షన్‌ సీన్స్‌లో, డ్యాన్స్‌ల కోసం ఆయన కష్టపడే తత్వం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇక తాజాగా ఆయన నటిస్తున్న 102వ చిత్రం 'జైసింహా' ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ, వయసు తన శరీరానికే గానీ మనసుకు కాదని చెప్పాడు. 'జైసింహా' చిత్రం నవరసాలతో ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ చిత్రమని, దీనిని అందరూ కుటుంబసమేతంగా చూడాలని కోరారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ, కళల అర్ధం పరమార్ధం నేను చేసే చిత్రాలలోనే ఉంటుంది. ప్రేమను అందరికీ పంచడమే నా సినిమాలకు మూలం. కనుక అందరూ కలిసి మెలసి ఉండాలి. ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ చిత్రం చేశామో.. దాని ప్రతిఫలం, ప్రేక్షకులు అభిమానులు అందుకోవాలి... అంటూ ప్రసంగించారు. ఇక 12వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం కోసం బాలయ్య అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి 'పైసావసూల్‌' డిజాస్టర్‌ని మరిచేలా ఈ చిత్రమైనా ఉంటుందో లేదో చూడాల్సివుంది!

Balakrishna About Jai Simha Movie:

Balakrishna Says Jai Simha will be the perfect family-friendly festival film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs