తమిళంలో కె.యస్.రవికుమార్ సీనియర్ టాప్ డైరెక్టర్. ఆయన నుంచి 'ముత్తు, దశావతారం' వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ 'జైసింహా' చిత్రం చేస్తున్నారు. దీనిపై బాలయ్య మాట్లాడుతూ, కె.యస్.రవికుమార్ గారితో మూడు నాలుగు సార్లు కలిశాం. సినిమా చేయాలని అనుకున్నాం. ఇన్నాళ్లకి ఆయనతో వీలైంది.ఆయనకు అంకితభావం ఎక్కువ. ఆయనకంటూ ఓ స్టార్‌డమ ఉంది. నవరసాలను పండించగలడు. ఆయనకు నిజాయితీ చాలా ఎక్కువ. ముఖ్యంగా బయట ఎంతో స్నేహంగా ఉంటారు. కెమెరా ముందుకు వెళ్తే మాత్రం అంతే ప్రోఫెషనల్‌గా ఉంటారు.
ఇక ఈ చిత్రంలో నయనతార ఎంతో మంచి పాత్ర చేసింది. జమీందారీ కథ, ఆమె మధ్యతరగతి యువతిగా కనిపిస్తుంది. ఆమెకి ఇన్‌వాల్వ్‌మెంట్‌ఎక్కువ. ఎంతో హుందా అయిన పాత్ర, ఆమె తన పాత్రలతో మనసుతో కనెక్ట్ అయి పరకాయప్రవేశం చేస్తుంది. మంచి కాంబినేషన్స్ కావాలని, భారీగా చిత్రం ఉండాలని దర్శకనిర్మాతలు కోరితే సరేననిచెప్పాం. ఇక ఇందులో 'నీ వయసు అయిపోదు. కానీ నాకు వయసు అయిపోతుంది. మనం ఎప్పుడుపెళ్లి చేసుకుందాం అంటుంది'. ఆ డైలాగ్‌ని చెప్పడానికి అంగీకరించినందుకే మేమెంతో సంతోషంగా ఉన్నాం.
నాకు వయసుతో పనిలేదు. పాత్రలోకి వెళ్లిపోతాను. ఎందుకంటే మెంటల్‌గా నేనుఇప్పటికీ యంగ్. ఇలాంటి డైలాగ్స్ వచ్చినప్పుడు సహజంగా ఎవరైనా ఇప్పుడు మా వయసుపై డైలాగ్స్ ఎందుకండీ అంటారు. కానీ నయనతార ఆ డైలాగ్‌చెప్పింది. దానికి ఆమెని అభినందించాలి. ఈ చిత్రంలో డైలాగ్స్ భలే ఉంటాయి. ఇక కథ, డైలాగ్స్, మాటలు అన్నిబాగా కుదిరాయి. పాటలు, మాటల రచయితలు బాగా రాశారు. ముందుగా సంగీతం కోసం ఇద్దరు ముగ్గుర్ని అనుకున్నాం. కానీ అంతకుముందే నేను 'గౌతమీపుత్రశాతకర్ణి' సమయంలో చిరంతన్‌భట్‌ని రెండు మూడుసార్లు కలిశాను. ఆయన ఆ చిత్రానికి అంత అద్భుతమైన సంగీతం ఇస్తారని భావించలేదు. ఈ చిత్రంకి అవకాశం ఇస్తే కసితో చేస్తారని ఓకే చెప్పాం.. అని చెబుతున్నాడు..!