ఈ ఆదివారం మీడియా లోని కొన్ని ఛానల్స్ ఒకే ఒక టాపిక్ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం చేశాయి. ప్రపంచంలో పనికొచ్చే విషయమే లేదన్నట్టుగా ఆ ఛానల్స్ వారు ఒక పనికిమాలిన విషయాన్ని పనిగట్టుకుని హైలెట్ చేసింది. కనీసం ఆ టాపిక్ వలన ఎవరికైనా ఏమైనా వరిగిందా అంటే అది లేదు. ఒక క్రిటిక్ ఒక హీరో ఫ్యాన్స్ నుండి తనకి ప్రాణ హాని ఉంది.... ఆ హీరో వచ్చి తనకి సారీ చెప్పాలని నిన్న ఆదివారం ఆ ఛానల్స్ సాక్షిగా హంగామా చేశాడు. అలాగే ఒక హీరోయిన్ అయిన ఒక అమ్మాయిని పేరుతో సంబోధిస్తూ ఆమెకు అరడజను ప్రశ్నలు సంధించాడు. అయినా ఒక క్రిటిక్ అయ్యుండి అలా ఒక హీరోయిన్ పర్సనల్ విషయాలు అతనికెందుకు.
ఇలా అడుగున్నది మనం కాదండోయ్... సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విషయమై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ క్రిటిక్, ఆ స్టార్ హీరో, ఆ హీరోయిన్ ఎవరు అంటే కత్తి మహేష్ తనకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి ప్రాణ హాని ఉందని... అలాగే హీరోయిన్ పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ ల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక ఛానల్ ఉదయం నుండి రాత్రి వరకు నానా హంగామా సృష్టించాడు కత్తి మహేష్. ఇక ఆ ఛానల్ వారు కూడా కత్తి మహేష్ కి సపోర్ట్ చేస్తుందో ఏమో క్లారిటీలేదుగాని... మహేష్ సంధించిన ప్రశ్నలు గంటకి అరడజను సార్లు చెబుతూ ప్రేక్షకులకు విరక్తి కలిగించింది. ప్రపంచంలో బోలెడన్ని సమస్యలుంటే కేవలం కత్తి మహేష్ ప్రాణ హాని ఉందని... ఒక స్టార్ హీరోని ఒక హీరోయిన్ ని ప్రశ్నిస్తూ పడిగాపులు కాస్తుంటే.. ఆ ఛానల్ ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలా ఒక పనికిమాలిన విషయాన్ని గంటల తరబడి చర్చించడం ఎంతవరకు కరెక్ట్.
ఇక కత్తి మహేష్... పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి ప్రశ్నిస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా బయలు దేరాడు. పవన్ కళ్యాణ్ జనసేనలో ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి రెడీ అవుతున్న సమయంలో ప్రశ్నిస్తున్నట్టు ఒక క్రిటిక్ పనిగట్టుకుని బయలుదేరడం అందరి అటెన్షన్ ని అతనివైపు ఉండేలా చేసుకోవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ తనని వేధిస్తున్నారని చెప్పడమే కానీ పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు సరికదా ఛానల్స్ లో లైవ్ షోలు చేస్తూ కాలం గడిపేస్తూ పవన్ తనతో చర్చకు రావాలంటూ చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యడం... ఇవన్నీ చూస్తుంటే మాత్రం కత్తి మహేష్ బాగా ఓవర్ చేస్తున్నాడని పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ జనాలు కూడా ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.
అయితే కత్తి మహేష్ ఒక ఛానల్ లో ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చుని... అక్కడినుండి మరో ఛానల్ లైవ్ షోకి హాజరవడం... దాదాపుగా ఉదయంనుండి రాత్రి 10 వరకు బయటే తిరగడం.. మళ్ళీ ఎవరైనా తన మీద దాడి చేస్తారేమో అని చెప్పడం ఇవన్నీ కూడా కాస్త కాదు చాలా ఓవర్ అయినట్లుగానే ఉంది. మరి ఇంత రచ్చ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం పెదవి విప్పలేదు. అంతేలే ఒక కత్తి మహేష్ కి సమాధానం చెబితే... మరిన్ని సుత్తి మహేష్ లు బయలుదేరతారని పవన్ కి తెలియదా ఏమిటి.