Advertisement

ఖాన్‌గారూ ఏం మాట్లాడుతున్నారు..?


దేశంలో మైనార్టీ ఓటు బ్యాంకు కోసం వారికి మద్దతు ఇచ్చి, తమను తాము లౌకిక వాదులుగా చూసుకోవాలనే వారి కుహనా మేధావుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. సమానత్వం అంటే అందరికీ సమానమే గానీ ఇది మైనార్టీలకి మద్దతు ఇవ్వడం కాదు. గతంలో పాకిస్థాన్‌ నటీమణులపై, ఆఘ్గనిస్గాన్‌ మలాలాపై ఫత్వాలు జారీ చేసినప్పుడు ఖండించలేని వారందరూ ఇప్పుడు సెన్సార్‌పై మాత్రం మండిపడుతున్నారు. ఎవరి మనోభాలకైనా విలువ ఇవ్వాలి. అంతే గానీ మైనార్టీ మనోభావాలే నిజమైన మనోభావాలు అనేది సరికాదు.

Advertisement

గతంలో సల్మాన్‌ రష్దీ నుంచి తస్లీమానస్రీమ్‌ వరకు ముస్లిం మతాచారాలు, చాంధసవాదాలపై పోరాడారు. తాజాగా ముస్లింలు రొయ్యలు తినవద్దని ఫత్వా జారీ అయింది. నీళ్లలో ఉండే జీవుల్లో కేవలం చేపను తప్ప దేనిని చంపి తినకూడదనేది ఖురాన్‌ చెబుతోందిట. అంటే చేపలవి మాత్రం ప్రాణాలుకావా? మరి గోమాత సంగతిలో వితండంగా వాదించేవారికి ఇప్పుడు రొయ్యల విషయంలో సమాధానం ఏమి చెబుతారు? మరో వైపు ఫిల్డర్‌ సిగరెట్లలో పంది కొవ్వును వాడుతారని వార్తలు వస్తున్నాయి. ఇక సైఫ్‌ అలీ ఖాన్‌ విషయానికి వస్తే ఆయనకు సామాజిక బాధ్యతలేదని ఫక్తు లౌకిక భావాలున్న నాటి కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి రాందాస్‌ గతంలో ఆరోపించారు. సిగరెట్లు తాగిన సీన్స్‌ని సినిమాలలో చూపించవద్దని కోరిన వెంటనే రజనీ, కమల్‌, అమితాబ్‌లు ఆయన పిలుపుకు స్పందించారు. అదే రాందాస్‌ సైఫ్‌ అలీ ఖాన్‌కి ఉత్తరం రాస్తూ పిల్లల ఆరోగ్యానికి హానికరమైన కుర్రుకుర్రే వంటి వాటికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించవద్దని కోరితే సైఫ్‌ వెటకారంగా స్పందించాడు. అంతేకాక ఆయన తన కుమారుడికి ఓ దేశ ద్రోహి పేరు పెట్టుకోవడం కూడా సంచలనమైంది.

తాజాగా సైఫ్‌ నటించిన 'కళాకాండీ' చిత్రానికి సెన్సార్‌ బోర్ద్‌ 72 కట్స్‌ చెప్పింది. ఆయన రివ్యూ కమిటికీ వెళ్లి ఒక్క కట్‌తో బయటపడ్డాడు. ఇక ఆయన సినిమా సెన్సార్‌లో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించాడు. బహుశా ఆయనకు ఇది మొదటి సారి తెలిసినట్లు ఉంది. ఇక నేడు మహాభారతం వంటి కథల కన్నా, 'బాహుబలి' వంటి కల్పితాలే తీయడం బెటర్‌ అన్నాడు. ఆయన అంతరంగిక ఉద్దేశం ఏమిటో ఈ మాటలతోనే తెలిసిపోతోంది. మరో వైపు ప్రజలు కూడా సున్నితంగా తయారైయ్యారని, మనోభావాలు దెబ్బతిన్నాయని రచ్చ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు.

మరి అదే ముస్లిం మనోభావాల విషయం ఆయన ప్రస్తావించలేదు. పాకిస్తాన్‌ సైనికులు భారతీయులను చంపడం, సిమి వంటి సంస్థలపై ఈయనకు నిజంగా మాట్లాడే దమ్ము ఉందా? ఇక కొన్ని చిత్రాలకు కొన్ని అరబ్‌ దేశాల నుంచి డాన్‌ల నుంచి ఆర్థిక సాయం అందుతోందని వార్తలు వస్తున్నాయి. అలాంటి సమయంలో సెన్సార్‌ని కఠినతరం చేయడంలో తప్పే లేదు...!

Better to make Baahubali than Mahabharat, says Saif Ali Khan:

Saif Ali Khan Sensational Comments on Movie Making
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement