Advertisement
Google Ads BL

చిరు టైటిల్ తో మంచు లక్ష్మీ వస్తుంది..!!


జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా బాగానే ఉంటుంది. అలాగే చక్కనమ్మ చిక్కినా అందమే వంటి సామెతలు మంచు లక్ష్మిప్రసన్నకు బాగా సూట్‌ అవుతాయి. డబ్బులకి కొదవలేని కుటుంబం. దాంతో తాను కూడా ఘట్టమనేని మంజుల, అశ్వనీదత్‌ కూతుర్ల తరహాలో ఎలాగైన తన ప్రత్యేకతను చూపాలని ఆశిస్తోంది. ఇటు టీవీషోలకి హోస్ట్‌గా చేసింది. మధ్యలో 'గుండెల్లో గోదారి, ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' వంటి చిత్రాలను నిర్మించింది. మరోవైపు తనకు తగ్గ పాత్రలను కూడా బాగానే చేస్తోంది. ఇదంతా మంచు మోహన్‌బాబుగారి పుణ్యమే. ఇక ఈమె త్వరలో టీవీ సీరియల్స్‌, గేమ్‌షోలతో పాటు వెబ్‌సిరీస్‌ని కూడా పట్టాలెక్కించనుందని వార్తలు వచ్చాయి. మోహన్‌బాబు అంటే నాగార్జునకి భయమో, అభిమానమో తెలియదు గానీ తాను నటునిగా ఎప్పుడుఇష్టం లేని చిత్రాలలో నటించలేదని, కానీ మోహన్‌బాబు నటించిన 'అధిపతి', మంచు విష్ణు నటించిన 'కృష్ణార్జున' చిత్రాలలో మాత్రం మోహమాటానికి వెళ్లానని స్వయంగా ఓసారి నాగార్జునే చెప్పాడు.

Advertisement
CJ Advs

ఇక బాలయ్యని ఒప్పించి 'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా', 'పెదరాయుడు'లో రజనీకాంత్‌ని ఇలా ఎలాగోలా బండినెట్టుకొస్తున్నారు. ఇక వెబ్‌సిరిస్‌లో నాగార్జున చేత ఓ పాత్ర చేయించాలని మంచు లక్ష్బి భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన నో అంటే మరో అక్కినేని కాంపౌండ్‌ హీరో సుమంత్‌తో ఈ వెబ్‌సిరస్‌ని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రం ఒప్పుకుంది. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ఆమె తన సొంత నిర్మాణంలోనే మరో చిత్రం చేయనుందట. థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి 'వేట' అనే టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం.

ఇక 'వేట' పేరుతో చిరంజీవి, జయప్రదలతో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చి ఆ నిర్మాతలను నిలువునా ముంచింది. మరోవైపు ఇప్పటివరకు రాజమౌళి శిష్యులెవ్వరూ సొంతగా దర్శకత్వ శాఖలో విజయం సాధించలేదు. మరి ఈ రెండు సెంటిమెంట్స్‌ని ఆమె అధిగమించి విజయం సాధిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. ఇప్పటికే నాగార్జున, బాలయ్యలకు ఎర్త్‌ పెట్టిన మంచు ఫ్యామిలీ త్వరలో నాగ్‌ లేదా సుమంత్‌తో పాటు చిరుని ఆయన టైటిల్‌తో కూడా ఎర్త్‌ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Manchu Lakshmi Comes with Chiranjeevi Veta:

Manchu Lakshmi Starts Veta.. soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs