Advertisement
Google Ads BL

కత్తి మహేష్ 'సాక్ష్యం' అంటూ ఇరికించేశాడుగా?


మహేష్ కత్తి అంటే బిగ్ బాస్ వరకు ఎవ్వరికి తెలియని పేరు, ముఖం. కానీ ఇప్పుడు మహేష్ కత్తి అంటే తెలియనివారుండరేమో. అంతలా మహేష్ కత్తి పాపులారిటీ పెరిగింది. కారణం బిగ్ బాస్ షో కాదండోయ్. పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ద్వారా కత్తి మహేష్ ఇలా సెలెబ్రిటీలా మారిపోయాడు. ఇప్పుడు ఏ నలుగురు మాట్లాడుకుంటున్నా అందులో కత్తి మహేష్ మాటలు ఉంటున్నాయంటేనే చూడండి...అతను ఎంతగా హాట్ టాపిక్ అయ్యాడో. పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత, సినీ జీవితం మీద మహేష్ కత్తి ట్వీట్స్ ద్వారా విమర్శలు చెయ్యడమే కాదు.. పలు ఛానల్స్ లో కత్తి  లైవ్ షోల ద్వారా పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నాడు. పవన్ ఫ్యాన్స్ కూడా పవన్ మీద ఒక మాటపడేసరికి రెచ్చిపోయి.. కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడం... కత్తి మహేష్ కి అనుకూలంగా మారింది. అలాగే నటి పూనమ్ కౌర్, కోన వెంకట్... పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా వ్యాఖ్యలు చెయ్యడం కూడా కత్తికి కలిసొచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్.... కత్తికి పరోక్షంగా కుల, వర్ణం మీద చేసిన ట్వీట్ ద్వారా కత్తి మహేష్ మరోమారు రెచ్చిపోవడానికి కారణం అయ్యింది. 

Advertisement
CJ Advs

పవన్, పూనమ్, కోన ట్వీట్స్ కి అప్పుడే ఘాటు రిప్లై ఇచ్చిన కత్తి ఇప్పుడు తాజాగా పవన్ ఫాన్స్ నుండి తనకి థ్రెడ్ ఉందని... అలాగే తన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ లు సమాధానాలు చెప్పాలని ఆదివారం ఉదయం నుండి సోమాజీగూడ ప్రెస్ క్లబ్బులో అలాగే టీవీ 9 ఛానల్ లో లైవ్ షోలో పడి గాపులు కాయడమే కాదు.... పలువురు అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు చెప్పాడు. ప్రెస్ క్లబ్బులో తన మీద పవన్ ఫాన్స్ దాడి చెయ్యడానికి యత్నించారని.. పవన్ కళ్యాణ్... ఫాన్స్ ని అదుపుచేయలేనివాడు రాష్ట్రాన్ని ఎలా అదుపుచేస్తాడని తీవ్ర విమర్శలు చేసాడు కత్తి. అలాగే పూనమ్ కౌర్ కి పవన్ కి ఎలాంటి సంబంధం ఉందొ... అనే దానికి పూనమ్ కౌర్ 6 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కత్తి మహేష్ డిమాండ్ చేశాడు. అందులో

మొదటిది: ఏపీ ప్రభుత్వం పూనమ్ కౌర్ కి చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ పదవిని కట్టబెట్టడానికి వెనుక ఎవరున్నారు?

రెండవది: పూనమ్ కౌర్ ఆత్మహత్యా యత్నం చేసినప్పుడు హాస్పిటల్ బిల్ ఎవరు కట్టారు?

మూడోది: తిరుపతిలో ఒకే గోత్ర నామాలతో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ లు ఎందుకు పూజలు జరిపించారు?

నాలుగోది: పూనమ్ ఆత్మహత్య యత్నం చేసినప్పుడు పవన్... పూనమ్ కౌర్ తల్లికిచ్చిన మాట ఏమిటి?

ఐదోది: పూనమ్ కి దర్శకుడు త్రివిక్రమ్ అంటే కోపమెందుకు.?

ఆరోది: పవన్, త్రివిక్రమ్ క్షుద్ర పూజలు జరిపించేటప్పుడు పూనమ్ అక్కడెందుకు ఉంది?

ఈ ప్రశ్నలకి పూనమ్ కౌర్ సమాధానాలు చెప్పాలని కత్తి మహేష్ మీడియా ముఖంగా డిమాండ్ చెయ్యడమే కాదు... తన దగ్గర సాక్ష్యాలున్నాయని కూడా చెబుతున్నాడు. పవన్ ఫ్యాన్స్ వలన తనకు ప్రాణ హాని ఉందని... సామాజిక స్పృహతో తాను పవన్ ని ప్రశ్నిస్తున్నానని.. తాను అస్సలు ఈ విషయంలో తగ్గనని.... ఎప్పటికి పవన్ కళ్యాణ్ విషయంలో ఇలానే ఉంటానని కూడా మహేష్  ఛానళ్ల సాక్షిగా పవన్ కి సవాల్ విసురున్నాడు.

Kathi Mahesh Targets Poonam Kaur and Pawan Kalyan:

Kathi Mahesh Asked 6 questions to Poonam Kaur. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs