అవకాశాల కోసం ఇలా దిగజారాలా?


తరతరాలకు తగ్గని అందం అని కొందరిని మాత్రమే అనగలం. నాటి రోజుల్లో సావిత్రి, శ్రీదేవి, జయప్రద, జయసుధ, రేఖ, మాధురి దీక్షిత్‌ వంటి వారిని అలా పోల్చేవారు. కానీ మగాళ్ల రాజ్యమైన సినీ ఇండస్ట్రీలో ఈ ఫీట్‌ హీరోలకే సాద్యం గానీ హీరోయిన్లకు కాదు అనే దానిని ఐశ్వర్యారాయ్‌ నుంచి ఎందరో తిరగరాస్తున్నారు. ఇంత లేటు వయసులో కూడా ఐశ్వర్యా కుర్రహీరోలతో రొమాన్స్‌ చేస్తూ అదరగొడుతోంది. ఇక నేడు కూడా అనసూయ వంటి వారు అలాంటి దారిలోనే నడుస్తున్నారు. వీరి కోవలోకి వచ్చే వారే నయనతార, అనుష్క, శ్రియ, త్రిషా, తమన్నా వంటి వారు.

శ్రియాశరన్‌ విషయానికి వస్తే నేటి యూత్‌ ఆమె సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంకా పుట్టకపోయి ఉండవచ్చు. ఆమె తెలుగు తెరపై రామోజీరావు నిర్మాతగా 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన 'ఇష్టం' ద్వారా పరిచయమైంది. 15ఏళ్ల కిందటే నాడు బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి'లో జోడీ కట్టింది. మరలా ఇటీవల 'పైసా వసూల్‌'లో ఆయనతో మరోసారి రొమాన్స్‌ చేసింది. ఇక తాజాగా ఆమె మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న 'గాయత్రి' చిత్రంలో అచ్చమైన అందాలతో, సంప్రదాయ బద్దమైన ఫొటోలో కనిపించి, ఆ క్యాప్షన్‌ ద్వారా కూడా ఆకట్టుకుంది. అంతలోనే అది కూడా కేవలం గంటల వ్యవధిలోనే 'గాయత్రి' లుక్‌ ఇచ్చిన ఇంపాక్ట్‌ నుంచి వీక్షకులను మరోసారి, మరో విధంగా తనవైపు తిప్పుకుంది.

ఆమె తాజాగా ఓ హాట్‌ ఫొటో షూట్‌లో అర్ధనగ్నంగా కనిపిస్తూ ఉన్న ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పెట్టింది. దాంతో 'గాయత్రి' లుక్‌ని, మరోవైపు ఈ కొత్త ఫొటోషూట్‌ .. రెంటిని చూసిన వారికి మతిపోతోంది. ఇక 'గాయత్రి' చిత్రంలో ఆమె మంచు విష్ణుకి జోడీగా కనిపించనుందని సమాచారం. మోహన్‌బాబుకి జోడీ కట్టాల్సిన వయసులో కొడుకు విష్ణుతో జతకట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఈమె ప్రస్తుతం రెండు తెలుగు, ఒక తమిళం, ఒక హిందీ చిత్రాలలో బిజీగానే ఉంది. అయినా తన అందాల బిగువు ఇంకా తగ్గలేదని చెప్పడానికి, తన 37ఏళ్ల వయసులో మరింత బిజీ కావడానికే ఆమె లేటెస్ట్‌ ఫొటో షూట్‌ పెట్టిందని విమర్శించే వారు ఉన్నట్లే.. ఆమె అందాలను బాగా ఎంజాయ్‌ చేస్తున్న రసిక ప్రియులు కూడా అంతే మంది ఉన్నారు.

Shriya Saran Half Nude Photoshoot Goes Viral:

Shriya posted a semi-nude photoshoot and the young fans cheered about the look
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES