Advertisement
Google Ads BL

మొత్తానికి శత్రువులంతా ఒక్కటయ్యారు!


కాలం ఎంతో విలువైంది. అంతేకాదు.. ఎంతటి గాయాలనైనా, గొడవలనైనా, మనస్పర్థలనైనా మాన్పే శక్తి మందుల కంటే కాలానికే ఉంది. ఇక విషయానికి వస్తే తెలుగుసినీ రంగంలో మెగాస్టార్‌ చిరంజీవి, కలెక్షన్‌కింగ్‌ మోహన్‌బాబు, యాంగ్రీ ఓల్డ్‌మేన్‌ రాజశేఖర్‌.. ముగ్గురిది మూడు విచిత్రమైన మనస్తత్వాలు. గతంలో వీరందరూ గొడవలు కూడా పడ్డారు. ముఖ్యంగా చిరంజీవితో మోహన్‌బాబు, రాజశేఖర్‌లు పలుసార్లు విభేదించి, సంచలనాలకు కారణమయ్యారు. చిరంజీవి నటించిన 'రమణ' రీమేక్‌ 'ఠాగూర్‌' విషయం నుంచి రాజశేఖర్‌కి చిరంజీవి అంటే కోపం ఉంది. దానిని ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత తీర్చుకున్నాడు. భారీగా గెలుస్తాడనుకున్న చిరంజీవి రాజకీయాలలో పెద్దగా రాణించలేకపోవడంతో సంతోషించాడు.

Advertisement
CJ Advs

ఇక మోహన్‌బాబుకి కూడా చిరు అంటే పడదు. నాడు సినీ పండుగ సందర్భంగా ఇన్‌డైరెక్ట్‌గా 'లెజెండ్‌' అంటే ఎవరు? 'సెలబ్రిటీ' అంటే ఎవరు? అని విమర్శించాడు. ఇక నాటి కమిటీలో ఉన్న కె.యస్‌.రామారావుని సిల్లీఫెలో అని వ్యాఖ్యానించి, ఆ తర్వాత ఆయన నిర్మించిన 'బుజ్జిగాడు మేడిన్‌ చెన్నై'లో అదే ఊతపదాన్ని వాడాడు. ఇక వీరందరికీ దాదాపు గురువు వంటి వ్యక్తి దాసరి. ఆయన నేడు మన మధ్య లేకపోయినా ఈ ముగ్గురిలో దాసరికి మోహన్‌బాబు అంటేనే ఇష్టం. ఇక విషయానికి వస్తే చిరంజీవి కూతుర్ల పెళ్లి చేసేసి తాత కూడా అయ్యాడు. రామ్‌చరణ్‌ని హీరోని చేసి, నిర్మాతగా కూడా మార్చి, రామ్‌చరణ్‌ అందించే పండంటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాడు.

దాదాపు మంచు మోహన్‌బాబు కూడా అదేదారిలో ఉన్నాడు. కుమారులను హీరోలను చేశాడు. కూతురిని తన కిష్టమైన ఫీల్డ్‌ ఎంచుకోమన్నాడు. ఇటీవలే మంచు విష్ణుకి పుట్టిన అవ్రం భక్త మంచు ఆనందంలో ఉన్నాడు. ఇక ఎంతో కాలంగా హిట్‌ లేని రాజశేఖర్‌కి సినిమా వసూళ్లు సాధించకపోయినా 'పీఎస్వీగరుడవేగ' కమ్‌బ్యాక్‌ మూవీగానే చెప్పాలి. ఆయన కూడా తన కూతుర్లను ఇదే ఏడాది హీరోయిన్లను చేస్తున్నాడు. మరోవైపు చిరు 'సైరా..', మోహన్‌బాబు 'గాయత్రి' లతో బిజీగా ఉండగా రాజశేఖర్‌ తదుపరి చిత్రానికి సంబంధించి కథలు వింటూ బిజీగానే ఉన్నాడు.

ఈ మూడు భిన్నదృవాలు తాజాగా టి.సుబ్బరామిరెడ్డికి చెందిన హోటల్‌లోని పార్టీకి హాజరయ్యారు. ఇందులో టి.సుబ్బరామిరెడ్డి, అశ్వనీదత్‌లతో పాటు పలువురు సెలబ్రిటీలు, పేజీ 3 వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు, మోహన్‌బాబు, రాజశేఖర్‌లు కలిసి ఓ ఫొటో తీసుకున్నారు. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది. వీరిముగ్గురిని చూస్తే బాధ్యతలన్ని పూర్తి చేసి ఎంజాయ్‌ చేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు, ముసలివారిలా రిలాక్సేషన్‌ని లీడ్‌ చేస్తున్నారా? అనిపిస్తోంది.

Top Celebrities Celebrates new Year at Park Hayat:

Chiranjeevi, Mohan Babu and Rajasekhar in New Year Celebrations  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs