Advertisement
Google Ads BL

మరో విలక్షణ చిత్రానికి ఓకే చెప్పాడు!


అక్షయ్‌కుమార్‌ నటునిగా, నిర్మాతగా పలు వైవిధ్యచిత్రాలను ఎంచుకుంటూ ఉంటాడు. 'ఓ మై గాడ్‌' నుంచి 'టాయిలెట్‌', త్వరలో 'ప్యాడ్‌మాన్‌' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఆయన తాజాగా ఈ కొత్త ఏడాది అంటే 2018లో తన కొత్త చిత్రం ప్రకటించాడు. ప్రకటించడమే కాదు.. అందులోని తన లుక్‌ని విడుదల చేసి, ఈ నూతన ఏడాదిలో నా మొదటి చిత్రం అని ప్రకటించాడు.

Advertisement
CJ Advs

ఇక అక్షయ్‌కుమార్‌ గతంలో ఎన్నో చిత్రాలలో సిక్కు మతస్థునిగా, తలపాగా ధరించి, అంటే టర్బన్‌ ధరించి 'టర్బనేటర్‌' అనిపించుకున్నాడు. ఆయన తాజా చిత్రంలో కూడా మరోసారి సిక్కు యువకుడి పాత్రను చేస్తున్నాడు. సిక్కులకు ఉన్నట్లుగా మీసాలు, గడ్డాలు పెంచి, పైన టర్బన్‌ ధరిస్తూ కనిపిస్తున్నాడు. ఈ లుక్‌కి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి టైటిల్‌ కూడా ఖరారైంది. ఈ చిత్రం పేరు 'కేసరి'. దీనిని ధర్మా ప్రొడక్షన్స్‌ బేనర్‌లో కరుణ్‌జోమార్‌ నిర్మిస్తున్నాడు. అనురాగ్‌సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం కథ బ్రిటిష్‌ ఇండియన్‌ బృందాలకు, ఆఫ్గనిస్తాన్‌ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ద నేపధ్యంలో పీరియాడికల్‌ మూవీగా రూపొందనుంది. మిగిలిన నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు. అక్షయ్‌కుమార్‌ న్యూలుక్‌పై కరుణ్‌జోహర్‌తో పాటు బాలీవుడ్‌ ప్రముఖులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని 2019 హోలీ సందర్భంగా రిలీజ్‌ చేయనున్నామని యూనిట్‌ ప్రకటించింది. మరి ఈ చిత్రం ద్వారా అక్షయ్‌కుమార్‌ మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచిచూడాల్సివుంది.....!

Akshay Kumar Different Role in Kesari:

Akshay Kumar Kesari Look Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs