Advertisement
Google Ads BL

ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికపైన!


కమల్‌హాసన్‌ తమిళుడు. ఆయన బాలనటుడి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇక రజనీ విషయం వేరు. ఆయన అసలు పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అయినా కర్ణాటకలో జీవనం సాగించి, బస్సు కండెక్టర్‌గా పనిచేశాడు. ఈ ఇద్దరు తమ కెరీర్‌ మొదట్లో ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. ఇద్దరికి హీరోలుగా బ్రేక్‌ఇచ్చింది దిగ్గజదర్శకుడు కె.బాలచందరే. ఇక రజనీ మాస్‌ హీరోగా పేరు తెచ్చుకోగా, కమల్‌ క్లాస్‌ హీరోగా, విభిన్నచిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నటనలో కమల్‌కి తిరుగేలేదు. కానీ అభిమానులు, ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌లో మాత్రం రజనీదే పైచేయి.

Advertisement
CJ Advs

ఇక వీరిద్దరు స్టార్స్‌ అయిన తర్వాత కూడా వారి అభిమానులు గొడవలు పడినా వీరిద్దరు మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. యాదృచ్చికంగా దాదాపు ఇద్దరు ఒకేసారి రాజకీయాలలోకి వచ్చారు. రజనీది మెతక స్వభావం. నిగర్వి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్‌ ఉన్నా సింపుల్‌లైఫ్‌ని ఇష్టపడతాడు. ఆధ్యాత్మిక ఎక్కువ. అందుకే తన రాజకీయాలు స్పిర్చువల్‌గా ఉంటాయని చెప్పాడు. ఆయనకు ఒకప్పుడు అన్ని అలవాట్లు ఉన్నా కూడా తదనంతరం మాత్రం అన్నింటిని వదిలేశాడు. ఏదైనా ఆచితూచి మాట్లాడుతాడు. దీనికి భిన్నదృవం కమల్‌హాసన్‌. ఆయనకు సంఘం, మతం, సంప్రదాయాలపై నమ్మకం లేదు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా నాస్తికుడు. ప్రపంచంలోని అన్ని జంతువుల మాంసాలు తిన్నానని చెబుతాడు. గోవు మాంసం తింటే తప్పేంటి అంటాడు? ఇక ఆయనకు వివాహంపై కూడా నమ్మకం లేదు. వాణిగణపతి, సారికా, సిమ్రాన్‌, గౌతమి.. ఇలా తనకంటే ఎంతో పెద్దదైన శ్రీవిద్య నుంచి ఎందరినో ఆటవస్తువులుగా వాడుకున్నాడు. మహా కోపిష్టి. ఇక ఈయనకు పెరియార్‌, డీఎంకే వ్యవస్థాపకుడైన అన్నాదురై ఆదర్శం. రోజూ గుడి ముందే ఉండి అడుక్కునే వాడికి, పూజలు చేసే పూజారికే సాయం చేయని దేవుడు ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్లినంత మాత్రాన నిన్ను కరుణిస్తాడా? అని ప్రశ్నిస్తాడు.

ఇక ఈ ఇద్దరు దిగ్గజ నటులు గతంలో హీరోలుగా ఎన్నో వేదికల్లో పాలుపంచుకున్నారు. కానీ వారు రాజకీయాలలోకి వస్తున్నామని చెప్పిన తర్వాత తొలిసారిగా తమిళ నటీనటుల సంఘం 'నడిగర్‌' వేడుకల్లో చాలా కాలం తర్వాత పాలు పంచుకుంటున్నారు. ఈ వేడుకకు మలేషియా ఆతిధ్యం ఇవ్వనుంది. వీరిద్దరిని ఒకే వేదికపైకి తేవడంతో ఈ ఘనత విశాల్‌కే దక్కుతుంది. మరి ఆ వేడుకలో ఇద్దరు ఏమి మాట్లాడుతారు? కలిసి పోటీ చేస్తారా? ఒకరిపై ఒకరు రాజకీయ పరంగా కత్తులు దూస్తారా? అనేది వేచిచూడాల్సివుంది...!

Kamal haasan and Rajinikanth in One Stage:

Rajinikanth and Kamal haasan Shares one stage in Malaysia
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs