Advertisement
Google Ads BL

ప్రదీప్ పై పోలీసులు భలేగా స్పందించారు!

pradeep,drunk,drive case,hyderabad,police,answer,netizen | ప్రదీప్ పై పోలీసులు భలేగా స్పందించారు!

న్యూఇయర్‌ సందర్భంగా యాంకర్‌, నటుడు ప్రదీప్‌ మాచిరాజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మోతాదు కంటే ఎంతో ఎక్కువ మద్యం తాగి పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇక ఈయనతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారు పోలీసుల కౌన్సిలింగ్‌కి హాజరై, కోర్టులకు హాజరవుతున్నా ప్రదీప్‌ మాత్రం ఇప్పటికీ హాజరుకాలేదు. దాంతో ప్రదీప్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. దాని వెంటనే ప్రదీప్‌ ఓ వీడియో రిలీజ్‌ చేస్తూ, తాను తప్పు చేశానని, షూటింగ్స్‌ బిజిలో కౌన్సిలింగ్‌కి రాలేకపోయానని, తాను హాజరు అవుతానని ప్రకటించాడు.

Advertisement
CJ Advs

కాగా హైదరాబాద్‌ పోలీసులకు చెందిన ఫేస్‌బుక్‌లో హనీ భవాని పేరుతో ఒకరు పోస్ట్‌ పెట్టారు. ప్రదీప్‌ పిల్లాడు. ఏదో తెలియక తప్పు చేశాడు. ఆయన్ను ఒగ్గేయండి.. ప్లీజ్‌ అంటూ పోస్ట్‌ పెట్టడంతో దానికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. ప్రదీప్‌ చిన్నపిల్లాడైతే పాలు తాగాలి. కానీ ఆయన తాగింది మందు. ఆయనేం చిన్నపిల్లాడు కాదు. సెలబ్రిటీలు అన్నతర్వాత పది మందికి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా తాగి వాహనాలు నడపకూడదు.. అని ఓ స్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ఇప్పుడది వైరల్‌ అవుతోంది.

Hyderabad Police Counter on Netizen:

Hyderabad Police Answer to Female Anchor Request to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs