Advertisement
Google Ads BL

మహేష్, బన్నీ.. ఎవరో ఒకరు తగ్గాల్సిందే!


రజిని 2.0 విడుదల ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇంతవరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఏప్రిల్‌ 27కి వస్తుందని వార్తలొచ్చినప్పటికీ అదే డేట్‌కి పోటీ పడుతోన్న 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' నిర్మాతలు ఏకమయ్యారు. ఇలా అనువాద చిత్రాలు వచ్చి స్ట్రయిట్‌ సినిమాలు ముందుగా వేసుకున్న ప్రణాళికని దెబ్బ కొట్టడం ఏమిటని నిలదీశారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు 'రోబో 2.0' ఏప్రిల్ 13 కి షిఫ్ట్ అయింది. ఇక ముందు నుండి ఏప్రిల్‌ 27 కచ్చితంగా వస్తున్నాం అని ఇప్పటికే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' ప్రకటించేశాయి. అయితే ఏప్రిల్ 27 ని ముందుగా అనౌన్స్‌ చేసిన 'నా పేరు సూర్య' నిర్మాతలు మాత్రం తమ ప్రణాళికలో మార్పు లేదని చెబుతున్నారు. ఆరు నూరు అయినా 'నా పేరు సూర్య' సినిమా ఆ డేట్ కే వస్తుందని లగడపాటి శ్రీధర్‌ మరోసారి ఖరారు చేశారు. అయితే అదే డేట్‌ కావాలంటున్న మహేష్‌ ఇప్పుడేం చేస్తాడు? భరత్‌ అనే నేను ఏప్రిల్‌ 27కే వస్తుందా లేక మే నెలకి వాయిదా పడుతుందా?

మహేష్ - కొరటాల కాంబినేషన్ అంటే బాగానే క్రేజ్ ఉంటది. బన్నీ రూపంలో ఎట్రాక్షన్‌ వున్నా.. కొత్త దర్శకుడు కనుక.. 'భరత్‌ అనే నేను' ఎక్కువ తూగుతుందని భావించి మహేష్ తగ్గట్లేదు. మరి ఇద్దరిలో ఒక్కరు కాంప్రమైజ్ అయితే ఇద్దరి సినిమాల కలెక్షన్స్ బాగుంటాయి. లేదా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం వుండే అవకాశం ఉంది.

Release Date Clash between Mahesh and Allu Arjun:

Naa Peru Surya vs Bharath Ane Nenu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs