Advertisement
Google Ads BL

రకుల్ రెండో స్థానానికి పడిపోయింది!


ప్రస్తుతానికి అంటే స్పైడర్, ఖాకీ చిత్రాల తర్వాత పూర్తిగా ఖాళీ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు దక్షిణాదిలో దూసుకుపోతున్న హీరోయిన్ గా, టాప్ లెవల్లో చక్రం తిప్పుతూ ఒక వెలుగు వెలిగింది. అయితే టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, సాయి పల్లవి వంటి హీరోయిన్స్ హవా ఎక్కువైన తర్వాత రకుల్ హవా తగ్గుతూ వచ్చింది అనేది వాస్తవం. ఆఫర్స్ లేక ఖాళీ అయిన రకుల్ ని కదిపితే... అలాంటిదేం లేదు.. కాస్త రెస్ట్ లో ఉన్నానంటూ తప్పించుకుంది. మరి ఇప్పుడు తాజాగా.... సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించబోయే తదుపరి చిత్రంలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎంపికైంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సాయిపల్లవి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ రెండో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే చెన్నైలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. మరి ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయినా? లేకపోతే.. సెకండ్ హీరోయినా? అనేది మాత్రం క్లారిటీ లేదు.

ఎందుకంటే ముందుగా మాంచి ఫామ్ లో ఉన్న సాయి పల్లవిని సెలెక్ట్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు రకుల్ ప్రీత్ ని సెలెక్ట్ చెయ్యడంతో... రకుల్ కి అవకాశాలు లేక ఇలా సెకండ్ హీరోయిన్ స్థాయికి పడిపోయిందా? అనే అనుమానంలో సినీప్రియులు ఉన్నారు. ఇకపోతే రకుల్, సాయి పల్లవి, సూర్యలు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నాడు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం 'తానా సేంద్ర కూట్టం' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రం 'గ్యాంగ్’ పేరుతో విడుదల కానుంది.

Rakul Preeth Singh Second Heroine in Surya Movie:

Rakul Preeth Singh Stage Downed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs