Advertisement
Google Ads BL

అఖిల్ మూడు గురించి లీకైంది..!


'హలో' సినిమా టాక్ బావున్నా కలెక్షన్స్ అనుకున్నంతగా లేవు. పెట్టిన పెట్టుబడి కూడా రావటం కష్టమే. మొదటి రోజు నుండి కూడా ఈ సినిమా మంచి టాక్ తో నడిచింది. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ మూడో సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటికి వచ్చింది.

Advertisement
CJ Advs

దర్శకుడు సత్య పినిశెట్టితో అఖిల్ తన మూడో  సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ డైరెక్టర్ చెప్పిన 2 స్టోరీస్ లో ఒకటి ఫైనలైజ్ చేసి ఈ నెల 10న అధికారికంగా అనౌన్స్ చేద్దాం అనుకున్నాడు అఖిల్. కానీ ఇంతలోనే ఈ వార్త బయటికి వచ్చేసి హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ సత్య పినిశెట్టి ఎవరో కాదు, స్వయానా రవిరాజా పినిశెట్టి తనయుడు. నటుడు ఆది పినిశెట్టి తమ్ముడు. సత్య పినిశెట్టి గతంలో తన తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన 'మలుపు' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కి మంచి పేరొచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే అఖిల్ మూడో సినిమాకు దగ్గుబాటి రానా ప్రొడ్యూసర్ అని కూడా టాక్ వినపడుతుంది. మరి సత్య పినిశెట్టి తీసిన 'మలుపు' వసూలు పరంగా ప్లాప్. అసలే ప్లాప్స్ లో ఉన్న అఖిల్.. ఇలాంటి ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది తేలాల్సి ఉంది.

Akhil Akkineni 3rd Film Details:

Akhil 3rd Movie Details Leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs