Advertisement
Google Ads BL

రజనీ రాజకీయంపై స్పందించిన అక్షయ్‌!


బాలీవుడ్‌లో చూడటానికి అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, హృతిక్‌రోషన్‌లు పెద్ద స్టార్స్‌గా అనిపిస్తారు గానీ ఏడాదికి రెండు మూడు చిత్రాలు విడుదల చేస్తూ అత్యధికంగా 100కోట్లు బడ్జెట్‌ గ్రూప్‌లో ఎక్కువ చిత్రాలు ఉన్న హీరోగా అక్షయ్‌కుమార్‌ని చెప్పాలి. ఈయన సైన్యంలో చనిపోయిన కుటుంబాలకు, నక్సలైట్ల దాడిలో వీరమరణం పొందిన గ్రేహౌండ్స్‌ వంటి వారికి ఏ ఆపద వచ్చినా నేను ముందుంటానని నిలబడి పది మందికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఇక ఏడాది ఆదాయంలో కూడా ఈయనది షారుక్ తర్వాతి స్థానమంటే విషయం అర్ధమవుతుంది. ఒకే చిత్రానికి భారీ రెమ్యూనరేషన్‌ తీసుకునే బదులు, ఎక్కువ చిత్రాలు చేస్తూ తక్కువ పారితోషికం తీసుకునే పాలసీ ఆయనది. ఆయనకు సామాజిక బాధ్యత కూడా ఎంతో ఎక్కువ. ఆయన నటించిన 'టాయిలెట్‌, ప్యాడ్‌మెన్‌' చిత్రాలు వాటిని నిరూపిస్తాయి.

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్‌లో స్టార్‌ అయిన నటుడు సౌతిండియన్‌ సినిమాలో విలన్‌గా నటించాలంటే దమ్ము కావాలి. కానీ దానిని అక్షయ్‌కుమార్‌ నిజం చేశాడు. ఆయన శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌, అమీజాక్సన్‌ జంటగా నటిస్తున్న '2.0' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్‌లో మెయిన్‌ అట్రాక్షన్‌ అక్షయ్ కుమారే. కాగా ప్రస్తుతం తాను పనిచేస్తున్న '2.0' హీరో రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై అక్షయ్‌ ఎంతో గొప్పగా స్పందించాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా ఖచ్చితంగా రాణిస్తాడు. ఆయనకు అంతా మంచే జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా పొలిటికల్‌గా సక్సెస్‌ అవుతాడు. ఆయన నా సహచర నటుడు కావడం గర్వకారణంగా ఉంది... అని సమాధానం ఇచ్చాడు.

మరో వైపు అమితాబ్‌బచ్చన్‌ నుంచి అందరూ రజనీ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నారు. కమల్‌హాసన్‌ కంటే రజనీని స్వాగతించే వారే ఎక్కువగా ఉండటం విశేషం. మరోవైపు రాఘవలారెన్స్‌, లైకా ప్రొడక్షన్‌ క్రియేటివ్‌ హెడ్‌ మహారాజలింగంలు రజనీతో కలిసి నడుస్తామని ప్రకటించారు. మొత్తానికి రెండు దశాబ్దాల ఎదురుచూపులకు రజనీ ఫలింపచేసినందుకు ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

Akshay Kumar Welcomes Rajinikanth political entry:

Akshay Kumar wishes to Rajinikanth politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs