పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్ కు రెడీ అయింది. మరో కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల దగ్గర పడటంతో పాటు ఈ సినిమా చుట్టూ కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. వాటిల్లో ఒకటి.. ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టి తీశారనేది.
అజ్ఞాతవాసి టీజర్ చూసి ఇది ఆ సినిమా పోలికలు బట్టి చాలా ఇంటెలిజెంట్ కాపీ కొట్టారని కొందరు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి లార్గో వించ్ సినిమా రీమేక్ రైట్స్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ టీసిరీస్ దక్కించుకుంది. అయితే అజ్ఞాతవాసి రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సంస్థ లీగల్ గా అడుగు ముందుకేస్తోందని టాలీవుడ్ లో ఎప్పటినుండో టాక్ వినిపిస్తోంది.
టీ - సిరీస్ కు రానా కాస్త పరిచయాలు ఉండటంతో ఈ ఇష్యూ బయటికి రాకుండా రానా ద్వారా పరిష్కరించుకోవాలని రాధాకృష్ణ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ కూడా ఉంది. అయితే ఆ సినిమా రీమేక్ రైట్స్ కి గాను ఆ సంస్థకు ఓ రూ.10 కోట్లు ఇచ్చి సినిమాపై వివాదం రేగకుండా ఉండేలా చూసేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి కొందరైతే ఈ సినిమా అత్తారింటికి దారేది సినిమాను అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ తీశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది నిజమో సినిమా చూస్తేనేగాని చెప్పలేం. మరి ఈ సినిమా విడుదల సమయానికి అసలు వివాదాలు రేగకుండా ఉండేందుకు గాను టిసీరీస్ తో దర్శక నిర్మాతలు 10 కోట్ల డీల్ నిజమనే న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో గట్టిగా వినబడుతుంది.