బాలకృష్ణ - ఏ ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న 'జై సింహా' సెన్సార్ కార్యక్రమాలతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బాలయ్యకి ఇప్పటివరకు సంక్రాంతి సెంటిమెంట్ బాగానే ఉంది. అందుకే ఇప్పుడు 'జై సింహా' మీద కూడా భారీ ఆశలే పెట్టుకుంది 'జై సింహా' టీమ్. కాకపోతే ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో పవర్ ఫుల్ కాంపిటీటర్ గా బాక్సాఫీసు బరిలో ఉండడం మాత్రం బాలయ్య అభిమానులను కాస్త కంగారు పెడుతున్న విషయం. ఎందుకంటే 'జై సింహా' ట్రైలర్ చూశాకా ఈ భయం అభిమానులలో మరింత ఎక్కువైంది. ఎందుకంటే 'జై సింహా' ట్రైలర్.. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు పెంచలేదని... రెగ్యులర్ మాస్ సినిమాలాగే ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పడ్డాయి. అందుకే ఇప్పుడు 'జై సింహా' టీమ్ మరో ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేందుకు రెడీ అయ్యిందనే టాక్ వినబడుతుంది.
అలాగే 'జై సింహా' స్టోరీ మొదట్లో ఇది కాదని నిర్మాత సి కళ్యాణ్ చెబుతున్నాడు. దర్శకుడు రవికుమార్ బాలకృష్ణ కోసం ఒక నెగెటివ్ కథని తయారు చేశాడని.. కానీ ఆ కథలో బాలయ్యని అలా నెగెటివ్ గా చూపించడం ఇష్టం లేని తాను మరో కథని ప్రిపేర్ చెయ్యమని చెప్పానని... అలాగే మొదటగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని అనుకున్నామని.. ఆమెకు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో చివరికి నయనతారని ఫైనల్ చేశామని కూడా చెబుతున్నాడు 'జై సింహా' నిర్మాత సి కళ్యాణ్. అలాగే నయనతార, మరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గనుక ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోకపోతే.. అసలు ఈ సినిమాని తీసే వాళ్ళమే కాదని కూడా చెప్పాడు.
ఇకపోతే.. ఈ సినిమాలో 2 వేల మంది పురోహితులతో తీసిన ధర్నా ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చిందని..... అది చూసేందుకే బాలయ్య సినిమాకు బ్రాహ్మణులు వస్తారని సి కళ్యాణ్ చెప్పడం చూస్తే 'జై సింహా' మీద మనకి ఎన్ని హోప్స్ ఉన్నాయో అర్ధమవుతుంది. అలాగే 'జై సింహా' సెన్సార్ టాక్ కూడా యు/ఏ సర్టిఫికెట్ తో పాజిటివ్ గా రావడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈ సంక్రాంతి రేసులో ఉన్న అజ్ఞాతవాసి, జై సింహా, రంగుల రాట్నం, గ్యాంగ్ సినిమాలలో ఏది పై చెయ్యి సాధించి ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది మాత్రం ఒక్క వారంలోనే తెలుస్తుంది.