బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ కోడలిగా, అభిషేక్ బచ్చన్ శ్రీమతిగా, దేశవ్యాప్తంగా పేరున్న బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా మారిన అదృష్టంతురాలు ఐశ్వర్యారాయ్. ఇక ఈమె తన వివాహం ముందు సల్మాన్‌ఖాన్‌తో కూడా ఎఫైర్ నడిపి వార్తల్లోకి వచ్చింది. ఇక నాడు ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫ్యామిలీకి కోడలుకావడంపై బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక విషయానికి వస్తే సాధారణంగా ఎందరికో బయటి ఎఫైర్లు ఉంటాయి. అది కూడా ప్రముఖ వ్యక్తులకు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటే మాత్రం అవి సంచలనాలకు వేదిక అవుతాయి. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేసి మన రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పనిచేసిన ఎన్.డి.తివారి తన తండ్రి అని ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. తివారికి మంచి రసికుడిగా ఎంతో పేరుంది. ఎందరితోనే ఎఫైర్లు ఉన్నాయి. ఆయన గవర్నర్ బంగ్లాలోని ఓ ఛానెల్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో వేశ్యలతో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇక తివారికి లెక్కలేనన్ని ఎఫైర్ ఉండటంతో అందరు ఇది నిజమేనని నమ్మారు. కానీ ఆ బిడ్డ ఏ మహిళకు పుట్టాడో కూడా తివారికీ గుర్తులేదు. చివరకు కోర్టు డీఎన్‌ఏ పరీక్షలు చేయడంతో ఆయన తివారి కొడుకేనని నిరూపితమైంది.
ఇక తాజాగా జయలలిత-శోభన్‌బాబులకు పుట్టిన అమ్మాయి విషయంలో కూడా పలు వివాదాలు రేగుతున్నాయి. ధనుష్‌కి తామే అసలు తల్లిదండ్రులమని అది రజనీకాంత్‌కి కూడా తెలుసని ఓ వృద్దదంపతులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ యువకుడు తాను ఐశ్వర్యారాయ్ కొడుకునని చెప్పి పతాక శీర్షికలకు ఎక్కాడు. ఆయన చెప్పేదాని ప్రకారం తాను లండన్‌లో ఐవీఎఫ్ మెథడ్‌లో 1988లో జన్మించాను. మూడేళ్ల వరకు తన అమ్మమ్మ బ్రింగ్యారాయ్ వద్ద పెరిగాను. ఆ తర్వాత విశాఖపట్టణంలోని చోడవరంలో పెరిగానని చెబుతున్నాడు. ఇక ఇతని విషయాలు ఎంక్వైరీ చేస్తే ఆయన ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నాడని, అతను చోడవరంలో పెరిగిన మాట వాస్తమమేనని తేలుతోంది.
మరోవైపు ఆయన తండ్రి ఓ మామూలు కండక్టర్ కావడంతో ఉద్యోగ రీత్యా ఈ అబ్బాయి కూడా వైజాగ్‌లో పెరిగాడట. ఇతని పేరు సంగీత్‌కుమార్. దానికి ఆయన రాయ్ తగిలించి ఐశ్వర్యా కొడుకునంటున్నాడు. ఇతను గతంలో యూట్యూబ్‌లో ఓ వెబ్ రేడియో కూడా నడిపాడని తెలుస్తోంది. దాంతో అసలు ఇతను ఎవరు? అని పలువురు చోడవరంలో గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఏ పుట్టలో ఏపాముందో ఎవరికి తెలుసు? అన్నట్లుగా ఈయన మాటలను కొట్టి పడేసేవారు ఉన్నట్లే అయితే అయ్యుండవచ్చు అని సమర్ధించేవారు కూడా ఉన్నారండీ.. అది విషయం...!