Advertisement
Google Ads BL

పెళ్లి చేసుకుందట.. ఆ ప్రాజెక్ట్ లో ఉంటుందా?


ఇండియాలో రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా బాహుబలి ఏ రేంజ్ హిట్ అయ్యిందో తెలిసిన తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు ఆ రేంజ్ సినిమాలు చెయ్యడానికి చొరవ చూపిస్తున్నారు. క్లారిటీగా చెప్పాలి అంటే...బాహుబలి సినిమా తరువాత అలాంటి సినిమాల ఆదరణ చాలా పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటి టైం లోనే తమిళనాట కూడా ఒక భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా మరేదో కాదు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న సంఘమిత్ర. తమిళ్ సినిమా ఇండస్ట్రీ లోనే అతి భారీ బడ్జెట్ గా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

Advertisement
CJ Advs

ఇకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా శృతి హాసన్ అని అనుకోవడమే కాదు.. ఆమెకు ఈ సినిమా కోసం యుద్ధవిద్యల్లో శిక్షణ కూడా ఇప్పించారు. కానీ శృతి ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని పేరు తెరపైకొచ్చింది. దాదాపుగా దిశాని ఫైనల్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయట. దిశా పఠాని పేరు ఇంకా పరిశీలనలోనే ఉందట. ఫైనల్ చేయలేదట. మరి ఆమె అయినా ప్రాజెక్టులో ఉంటుందో లేదో అనేది మల్లి పెద్ద డౌట్.

ఎందుకంటే ఇప్పుడు తాజాగా దిశా పాటని సీక్రెట్ గా పెళ్ళి చేసుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తున్న దిశా ఇలా ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయమై అటు టైగర్ ష్రాఫ్ గాని.. ఇటు దిశా గాని క్లారిటీ ఇస్తేనే గాని ఈ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఇకపోతే ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈసంఘమిత్ర కి సంగీతాన్ని అందిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 

Doubts on Disha Patani Sanghamitra Role:

Tiger Shroff and Disha Patani secretly got married in Goa?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs