ఒకప్పుడు అదరచుంభనాలు, శృంగారం వంటివి చూపాలంటే ఏవో రెండు జంట పక్షులనో, పువ్వులనో చూపించేవారు. తర్వాత ముద్దు అంటే బుగ్గకి బుగ్గ రాసుకోవడంలాగా ఉండేవి. నాడు లిప్‌లాక్ సీన్స్ అంటే కేవలం హాలీవుడ్ చిత్రాల మీదనే ఆధారపడి ఉండేవారు. తర్వాత ఈ ట్రెండ్ బాగానే బాలీవుడ్ వంట పట్టించుకుంది. బోల్డ్ చిత్రాలనే పేరుతో లిప్‌లాక్ సీన్స్, శృంగార కంటెంట్‌ని నమ్ముకునే చిత్రాలు తీసే వారు పుట్టుకొచ్చారు. ఆ తర్వాతి స్థానం మాత్రం నాచురాలిటికీ పెద్ద పీట వేయడం అనే తంతులో భాగంగా కోలీవుడ్ చిత్రాలు పుట్టుకొస్తున్నాయి.
ఇక 'గృహం, అర్జున్‌రెడ్డి' చిత్రాలు తెలుగులో కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఇక ఇటీవల తాను బాబీ సింహతో కలిసి నటించిన చిత్రంలో ఎంతో శృంగార సన్నివేశాలలో వివాదాస్పద హీరోయిన్ అమలాపాల్ నటించింది. ఈ చిత్రం తెలుగులో 'దొంగోడొచ్చాడు'గా రానుంది. తన నడుం గురించి ఇంతగా చర్చించుకుంటారని, కేవలం తన నడుము అందాలు, నాభి అందాలు చూసేందుకే ప్రేక్షుకులు ధియేటర్లకు వస్తారని తనకి తెలియదని, ఇలాగైతే ఇక ప్రతి చిత్రంలో అలాంటివి ఉండేలా చూసుకుంటానని నిత్యం వార్తల్లో ఉండే ఈ లేడీ వర్మ సంచలన కామెంట్స్ చేసింది.
తాజాగా ఆమె మరో మెట్టు పైకెక్కి మరో బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను నటించిన చిత్రాలలో శృంగార సన్నివేశాలలో నటించేందుకు తన తోటి సహచర నటులు, హీరోలు ఇబ్బంది పడ్డారేగానీ తాను మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడలేదని చెప్పింది. రాబోయే కాలంలో తన చిత్రాల నుంచి అదరచుంభన సన్నివేశాలను కూడా ప్రేక్షకులు ఆశించవచ్చని, అయితే లిప్‌లాక్ సీన్స్ నాచురల్‌గా ఉంటే తాను తన్మయత్వం చెందుతానని, అంతేగానీ మేకప్ వేసి, లిప్‌స్టిక్‌లు వస్తే తనలో ఆ ఫీలింగ్స్ కలగవని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.