Advertisement
Google Ads BL

దిల్‌రాజు ఇక ఈ హీరోయిన్ ని వదలడు!


ఎవరు ఎన్ని చెప్పినా ఏ కథలకైనా ట్రెండ్‌ ఉంటుందేమో గానీ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం ఎవర్‌గ్రీన్‌. ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవివి సత్యనారాయణ తర్వాత ఈ పాయింట్‌ని బాగా పట్టుకున్న దర్శకుడు అనిల్‌రావిపూడి, ఆయన తీసిన 'పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌'.. ఇలా ద్వితీయ విఘ్నం లేకుండా హ్యాట్రిక్‌ హిట్స్‌ ఇచ్చాడు. ఇక దిల్‌రాజుకి కూడా ఈ దర్శకునిపై మంచి గురి ఏర్పడింది. సాధాసీదా కథను కూడా కామెడీతో హిట్‌ ట్రాక్‌లో నిలపడంతో పేరు తెచ్చుకుంటున్న అనిల్‌రావిపూడితో దిల్‌రాజు మరో చిత్రం రెడీ చేస్తున్నాడు. దీనికి 'ఎఫ్‌ 2' అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసుకున్నారు. 'ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌' పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

దిల్‌రాజు విషయానికి వస్తే ఆయన గతంలో అనిల్‌రావిపూడితోనే కాదు వెంకటేష్‌తో మహేష్‌ని కలిపి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' తీశాడు. వరుణ్‌తేజ్‌తో 'ఫిదా' తీసి వరుణ్‌ని 50కోట్ల క్లబ్‌లో నిలబెట్టాడు. ఇక ఇంత మందిని రీపీట్‌ చేస్తున్న దిల్‌రాజు వరుణ్‌తేజ్‌ సరసన ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌ని కూడా రిపీట్‌ చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో నాని సరసన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' చిత్రం ద్వారా పరిచయమైన భామ మెహ్రీన్‌.

ఈమె మొదట్లో కాస్త నెమ్మదించినా ఆ తర్వాత 'మహానుబాహుడు, రాజా ది గ్రేట్‌' చిత్రాలతో పాటు సాయిధరమ్‌తేజ్‌ వంటి మెగా హీరోతో 'జవాన్‌'లో నటించింది. ఇందులో కూడా దిల్‌రాజు హ్యాండ్‌ ఉంది. ఇక తాజాగా 'ఎఫ్‌ 2'లో వరుణ్‌తేజ్‌ సరసన మెహ్రీన్‌ని ఎంపిక చేశారు మెగా మేనల్లుడితో మెప్పించలేకపోయినా ఈమె మెగాహీరోతోనైనా హిట్‌ని ఇస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది. మరోవైపు వెంకీ తేజ సినిమాతో, వరుణ్‌తేజ్‌ 'తొలి ప్రేమ' బిజీలలో ఉన్నారు. ఇద్దరు ఫ్రీ అయిన వెంటనే ఈ చిత్రాన్ని స్టార్ట్‌ చేసి డిసెంబర్‌లో క్రిస్మస్‌కానుకగా రిలీజ్‌ చేయాలని దిల్‌రాజు భావిస్తున్నాడు....!

Again Mehreen Booked for Dil Raju Movie:

Mehreen for Anil Ravipudi F2 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs