Advertisement
Google Ads BL

టీజర్: చెట్టుకి చేప కథ చెబితే.. అ!


ఇప్పుడు నాని అటు హీరోగానూ ఇటు నిర్మాతగానూ యమా బిజీగా వున్నాడు. 'ఎంసీఏ' ని అలా విడుదల చేసేసి కోట్లు కొల్లగొట్టేసిన నాని ఇప్పుడు మేర్లపాక దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' తో పాటు తానే స్వయంగా నిర్మాతగా మారి 'అ' అనే సినిమాని నిర్మిస్తున్నాడు. మరి టైటిల్ తో ఎంతో ఆసక్తిని పెంచేసిన నాని 'అ' సినిమాలో కేరెక్టర్స్ ని పరిచయం చేస్తూ మీడియాలో వదిలిన పోస్టర్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. అసలు ఇలాంటి డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటివరకు తెలుగులో సినిమాలు తెరకెక్కాయా అన్నట్టుగా ఉన్నాయి 'అ' పోస్టర్స్. అలాగే ఇప్పుడు విడుదలైన 'అ' టీజర్ ని చూస్తుంటేనూ అలానే అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అసలు 'అ' కథ ఏమిటనేది చెప్పకుండా నాని చేసిన ప్రయత్నం మాత్రం బాగానే ఫలించిందని చెప్పాలి.  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో నాని చేపలాగా కనిపించడంతో పాటు రవితేజ చెట్టు మాదిరిగా కేరెక్టర్స్ ని పరిచయం చేశాడు.  అసలు ఒక చేపకు నాని, ఒక చెట్టుకి రవితేజ వాయిస్ ఓవర్స్ ఇవ్వడం కాస్త గమ్మత్తుగా అనిపించింది. నాని (చేప), రవితేజ(చెట్టు) ఈ ఇద్దరి సంభాషణతోనే టీజర్ స్టార్ట్ చేశారు. ఈ ఇద్దరు కనిపించరు కాని కేవలం వినిపిస్తారు. 

ఇక ఆయా పాత్రలను పరిచయం చేస్తూ అంటే నిత్యా మీనన్, కాజల్, మురళి శర్మ, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్ ఇలా పాత్రలను జస్ట్ పరిచయం చేస్తూ చెట్టు అంటే రవితేజ ఈ కథలో హీరో ఎవరు అంటే... దానికి చేప నాని ఈ సినిమాలో హీరో ఎవరు లేరు... కథే హీరో అని చెప్పడంతో ఈ టీజర్ ఎండ్ అయ్యింది. మరి కథ ఏమిటి అనేది క్లారిటీ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ తో 'అ' సినిమా మీద విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశారు నాని అండ్ కో. 

Click Here For AWE Teaser

Awe Teaser: Just Characters:

Nani Awe Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs