Advertisement
Google Ads BL

కేథరిన్‌కి కాబోయేవాడికి ఉండాల్సిన క్వాలిటీస్!


తాజాగా హీరోయిన్‌ కేథరిన్‌ తన కళ్లే తనకు ఎస్సెట్‌ అని చెప్పింది. అందరూ కేథరిన్‌ కళ్లలో ఓ పవర్‌ ఉంటుంది. ఆమె కళ్లే ఆమెకి సెక్సీనెస్‌గా ఉంటాయి. ఆమె కళ్లే ఎంతో ప్రత్యేకం అని కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటారు. సామాన్య ప్రేక్షకులే కాదు. నేను పనిచేసిన నీలకంఠ, కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్‌, బోయపాటి వంటి వారు కూడా ఇదే మాట చెప్పేవారు. సినిమా నటీమణులకి కళ్లు ఎంతో బాగుండాలని నా అభిప్రాయం. కళ్లతోనే నేను చిలిపితనాన్ని, కోపాన్ని, నవరసాలను పండించగలను. నేను దుబాయ్‌లో పుట్టాను. బెంగుళూరులో ఉన్నప్పుడు 'శంకర్‌ ఐపీఎస్‌' అనే చిత్రంలో చాన్స్‌ వచ్చింది. సరదాగా చేసి చూద్దామని భావించాను. అందులో దునియా విజయ్‌ హీరో. ఆ తర్వాత మలయాళంలో చాన్స్‌ వచ్చింది. వెంటనే తమిళం, తెలుగులో నీలకంఠగారి 'ఛమ్మక్‌చలో', కృష్ణవంశీగారి 'పైసా' చిత్రాలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక నేను 'ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు' ఇలా అల్లుఅర్జున్‌తో మూడు చిత్రాలు చేయడం నా అదృష్టం. అయితే అది రికమండేషన్‌ కాదు. యాదృచ్చికంగా జరిగింది. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలోని నేను నటించిన పాత్రకు సూట్‌ అవుతానని పూరీగారు భావించారు. తర్వాత రుద్రమదేవిలో గెస్ట్‌ రోల్‌ చేశాను. ఈ ప్రాజెక్ట్‌లోకి అల్లుఅర్జున్‌ లేట్‌గా ఎంటర్‌ అయ్యారు. ఇక 'సరైనోడు'లో నా పాత్ర విషయంలో బోయపాటిదే ఫైనల్‌ డెసిషన్‌. 

ఇక నాకు కాబోయే వాడు ప్రభాస్‌లా హైట్‌ ఉండాలా? మహేష్‌లా తెల్లగా ఉండాలా? పవన్‌లా డైలాగ్స్‌ చెప్పాలా? అనే విషయానికి వస్తే నాకు కాబోయే వ్యక్తి విషయంలో నా వద్ద పెద్ద లిస్టే ఉంది. అతను లుక్స్‌పరంగా చూసుకుంటే షూష్‌ వేయాలి. మంచి డ్రస్సింగ్‌ సెన్స్‌ ఉండాలి. హెయిర్‌స్టైల్‌ బాగుండాలి. మంచి ముక్కు, కళ్లు ఉండాలి. సెన్సార్‌ హ్యూమర్‌ ఎంతో ఉండాలి. ఇలా నా వద్ద పెద్ద లిస్టే ఉంది. మీకు అన్ని చెబితే బోర్‌ కొట్టేస్తుంది అంటోంది ఈ ముదురు గుమ్మ.

Catherine Tresa Reveals her Ideal Husband Qualities:

Catherine Tresa Special Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs