Advertisement
Google Ads BL

వర్మ 'అజ్ఞాతవాసం' పూర్తయిందట..!


ఏమాటకామాటే చెప్పుకోవాలి గానీ దశాబ్దకాలం గ్యాప్‌ తర్వాత సినిమాలలోకి మరలా రీఎంట్రీ ఇచ్చి తన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్‌ 150'తో మెగాస్టార్‌ ఎలాగైతే 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అనిపించుకున్నాడో.. ఇప్పుడు ట్విట్టర్‌ ఖాతాదారులు కూడా తమ ట్విట్టర్‌ బాస్‌ రాంగోపాల్‌వర్మ మరలా రీఎంట్రీ ఇవ్వడంతో బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు. ఇక గతేడాది మే 27న రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌ ఖాతాను క్లోజ్‌ చేశాడు. ఇక నుంచి పవన్‌ గురించి గానీ మెగా ఫ్యాన్స్‌ గురించి గానీ ఎవ్వరి గురించి ఇక ట్వీట్స్‌ చేయను. వోడ్కా మానేస్తాను అని చెప్పిన వర్మ తాను ఎప్పుడు చెప్పే విధంగానే.. నేను మాటపై నిలబడనని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

మే 27 2009లో తన ట్విట్టర్‌ ఖాతా పుట్టిందని అదే మే 27 2017లో తన ట్విట్టర్‌ మరణించిందని ఆయన కామెంట్‌ చేశాడు. అయిన కూడా తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా మాత్రం ఆయన తనదైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. 'అర్జున్‌రెడ్డి', డ్రగ్స్‌, వి.హనుమంతరావు, పవన్‌ నుంచి ఇవాంకా వరకు ఆయన ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. అయినా తనకు ఉన్న ఫాలోయింగ్‌ కాస్త తగ్గింది అని భావించాడేమో మరలా ట్విట్టర్‌లో ప్రత్యక్ష్యమయ్యాడు. యేసుక్రీస్తు పునరుత్ధానంలా నాకు ఇది రెండో జన్మ. ఇక హ్యాపీన్యూయర్‌ అని చెబుతూ, పాత ఏడాదికి వీడ్కోలు చెప్పాడు. 

మరో వైపు పవన్‌కల్యాణ్‌ 'అజ్ఞాతవాసి' నుంచి స్ఫూర్తి పొందే తాను ట్విట్టర్‌ 'అజ్ఞాతవాసం' నుంచి బయటికి వచ్చానని తెలిపాడు. మరోసారి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై ఆయన ట్వీట్‌ చేశాడు. రజనీ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చేటప్పుడు స్క్రీన్‌పై కనిపించే రజనీ కంటే ఎంతో ప్రభావితంగా కనిపించాడు. నాకు తెలిసిప్రతి తమిళుడు ఆయనకే ఓటేస్తారు. ఆయనకు పోటీగా నిలబడాలనుకునే పార్టీలది మూర్ఖత్వం అవుతుందని తెలిపాడు. ఇక వర్మ ట్విట్టర్‌లో మరలా ప్రవేశించడంతో నెటిజన్లు భలే గమ్మత్తుగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

'ట్విట్టర్‌బాస్‌ ఈజ్‌ రెడీ..గెట్‌ రెడీ మెగాఫ్యాన్స్‌', 'మిస్డ్‌యు సో మచ్‌సార్‌, సినిమా రిలీజ్‌ సమయానికి వచ్చావు.. అర్ధమైంది, హాయ్‌ బ్రో వెల్‌కం బ్యాక్‌, ఇన్నిరోజుల నుంచి మీరు లేక ట్విట్టర్‌ బోర్‌ కొడుతోంది.., ఛీఛీ మళ్లీ దరిద్రం మరలా వచ్చింది. నాకు కరెక్ట్‌గా ఎగ్జామ్స్‌ ఉన్నప్పుడు యాక్టివేట్‌ అవుతావు..' అంటూ పలువురు నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. 

RGV back to Twitter Again With Tweets :

Ram Gopal Varma returns to Twitter and immediately starts a clash between Pawan Kalyan and Rajinikanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs