తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే తాను కేసీఆర్‌ని కలుసుకున్నానని పవన్ చెప్పడం, ప్రగతి భవన్‌లో ఎంతో విలువైన కాలంగా భావించే పవన్ గంటకు పైగా ఎదురు చూడటం, కేసీఆర్‌ని కలిసి మంతనాలు జరపడం వంటివి చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక పవన్‌ని కేసీఆర్ డిన్నర్ చేయమన్నా కూడా ఆయన నో చెప్పాడు. ఇక రాజకీయాలు, ఇతర సమస్యలపై చర్చించారు. దీంతో కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ని పవన్ పొగుడుతూ ప్రసంగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ దోపిడీకి పవన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడని విమర్శించారు.
ఇక కేసీఆర్.. పవన్ విషయంలో మాట్లాడుతూ, పవన్ మనవాడే.. బాగా చూసుకోండి అని టిఆర్‌ఎస్ కార్యకర్తలకు, శ్రేణులకు పిలుపునివ్వడం కూడా కాకరేపుతోంది. అంతకు ముందే కేసీఆర్.. పవన్ ఎవరు బై అన్నాడు. మొన్నటికి మొన్న కేటీఆర్.. పవన్‌ని అపరిచితుడితో పోల్చాడు. ఇక ఈ పరిణామంపై కత్తి మహేష్ కూడా స్పందించాడు. ఆయనది ఒక తిక్క సేన అని ఆయన పిచ్చిసేనాని అని వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో ఎదురు చూపులు 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షోలకా? లేక రాజకీయాలకా ? మొత్తానికి 'అజ్ఞాతవాసి' ఎన్ని స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారో కాస్త చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ అని కత్తి మహేష్ ప్రశ్నించాడు. తన మాజీ భార్యపైనే ఆయన అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా దాడి చేస్తేనే ఖండించని పవన్, తనపై పవన్ అభిమానులు చేస్తున్న దాడిని ఖండిస్తాడని తాను భావించడం లేదని తెలిపారు.
ఇక 'కత్తి మహేష్‌పై దాడి ఆపండి' అనే ఒకే మాట పవన్ చెబితే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. కానీ ఆయన చెప్పరు. ఆయనో బఫూన్. ఇక పవన్ అవకాశవాద రాజకీయాలు, ఓట్ల చీలిక వంటి ద్వారానే రాజకీయాలలోకి వస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను ఆయనతో పోటీకి దిగుతాను. నా ఐడియాలజీకి సూట్ అయ్యే పార్టీ ఏదీ నాకు కనిపించడం లేదు. దాంతో నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని కత్తిమహేష్ ఈ వివాదాన్ని పీక్స్‌కి తీసుకెళ్లాడనే చెప్పాలి.