సునీల్ రేంజ్ అందాల రాముడు, మర్యాదరామన్న తర్వాత సినిమాల నుండి పడిపోతూనే ఉంది. మొన్నటికి మొన్న 2 కంట్రీస్ తో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన సునీల్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు, కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే ఇలా సైడ్ కేరెక్టర్స్ తో పాటు కమెడియన్ గా కొనసాగుతానని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక 2 కంట్రీస్ తో మాగ్జిమమ్ సునీల్ హీరో కెరీర్ ముగిసినట్లే. అయితే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే సునీల్ ఇప్పుడు కొన్ని విషయాల్లో కాస్త గట్టిగానే స్పందించాడు. అందులో ముఖ్యమైనది మాత్రం డైరెక్టర్ మారుతీ విషయం.
డైరెక్టర్ మారుతీ గతంలో భలే భలే మగాడివోయ్ సినిమా కథని ముందుగా సునీల్ కి వినిపించగా... ఆకథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పి డెవలప్ చెయ్యమని సునీల్ మారుతికి చెప్పగా... మారుతీ మళ్ళీ ఆ కథని అంటే భలే భలే మగాడివోయ్ కథని సునీల్ కి చెప్పకుండా కొన్నాళ్ల తర్వాత నాని హీరోగా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడట. అయితే ఆ టైంలో మారుతి సునీల్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు. అదేమిటంటే... సునీల్ దగ్గరికి భలే భలే మగాడివోయ్ కథతో వెళితే.. ఆ కథని మహేష్ బాబు ఒక్కడు సినిమా లాగా మార్చమని అడగడంతోనే ఆ కథని పెట్టి నానితో సినిమా చేశానని చెప్పాడు. అయితే ఆ విషయం గురించి సునీల్ ఇప్పుడు తాజాగా స్పందించాడు. మారుతీ అలా చెప్పడం కరెక్ట్ కాదని.. మతిమరుపు కథని ఎవరైనా మహేష్ ఒక్కడిలా మార్చమంటారా... అలా మార్చమనడానికి నేనేమైనా మహేష్ నా... అంటూ అక్కడ జరిగింది ఒకటైతే.. మారుతీ మాత్రం అలా మార్చి చెప్పాడని... సునీల్, మారుతీ విషయంలో కాస్త ఘాటుగానే స్పందించాడు.
ఆ విషయం అలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో తాను నటిస్తున్నట్టుగా సునీల్ ధ్రువీకరించాడు. అలాగే చిరు కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 లో చెయ్యలేకపోవడానికి కారణం ఈడు గోల్డ్ఎహే సినిమా కాల్షీట్స్ ప్రాబ్లెమ్ వలన నటించలేకపోయానని కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే పటాస్ సినిమా తన నుండి కళ్యాణ్ రామ్ కి వెళ్ళడానికి తన నిర్మాతల తప్పిదం వలన జరిగిందనే విషయాన్నీ కూడా చెప్పాడు సునీల్. ఏదైనా ప్రస్తుతం సునీల్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేందుకు పూర్తిగా సిద్దమయ్యాడు.