Advertisement
Google Ads BL

పూజాకి మరో స్టార్ హీరో సరసన ఛాన్స్!


2016 సంక్రాంతి పండుగకి తారక్ 25 వ చిత్రం హడావిడి ప్రారంభమై నాన్నకు ప్రేమతో రూపంలో అభిమానులని అలరించగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25 వ చిత్రంగా అజ్ఞ్యాతవాసి ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల కాకముందే ప్రస్తుతం 24 వ చిత్రం చిత్రీకరణలో బిజీగా వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంపై బజ్ పెరిగిపోతోంది. మహేష్ కెరీర్ లో 25 వ చిత్రం కావటంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచేలా నిర్మాతలైన చలసాని అశ్వని దత్, దిల్ రాజు లు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథంలో కథానాయికగా నటించిన పూజ హేగ్దేకి మహేష్ బాబు 25 వ చిత్రంలో మరోసారి అవకాశం ఇచ్చే ఆలోచనలో వున్నాడట నిర్మాత దిల్ రాజు. ఇప్పటి వరకు పూజ హేగ్దే నటించిన ముకుంద, ఒక లైలా కోసం, మొహంజదారో చిత్రాలు ఏవి బాక్స్ ఆఫీస్ హిట్స్ కాలేకపోయాయి. దువ్వాడ జగన్నాథం పర్వాలేదనిపించుకుంది. అయినప్పటికీ స్టార్ హీరో సినిమాలో క్రౌడ్ పుల్లింగ్ ఎలెమెంట్స్ కి పనికొచ్చే ఎలెమెంట్స్ అన్ని పూజ హేగ్దే లో మెండుగా వున్నాయి అని గమనించిన దిల్ రాజు మహేష్ బాబు సరసన పూజాని హీరోయిన్ గా బుక్ చేసుకోవటానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశకి చేరుకునే సమయానికి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Pooja Hegde in Mahesh Babu 25th Film:

Pooja Hegde Got Another Big Chance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs