Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 2 పై ఆలోచనలో ఎన్టీఆర్..!


ఎన్టీఆర్ గోల్డెన్ టచ్ తో దాదాపు 3నెలల పాటు ఏకథాటిగా నంబర్ వన్ స్థానంలో కొనసాగింది స్టార్ మా. బిగ్ బాస్ ఇలా కంప్లీట్ అయిందో లేదో వెంటనే టాప్ ప్లేస్ ని కోల్పోయింది స్టార్ మా. మళ్ళీ నంబర్ వన్ స్థానంకి రావాలంటే బిగ్ బాస్ సీజన్-2 కూడా ఎన్టీఆర్  హోస్ట్ చేయాలి. కానీ ఇప్పటికే అధికారికంగా రెండు సినిమాలు ఒప్పుకున్నాడు ఎన్టీఆర్. ఒకటి త్రివిక్రమ్ తో..ఈ సినిమా జనవరి లో షూటింగ్ స్టార్ట్ చేసుకుని దసరాకి విడుదల చేయాలనీ ప్లాన్. దాని వెంటనే రాజమౌళితో మల్టీ స్టార్రర్. ఈ చిత్ర షూటింగ్ ఆగష్టులో స్టార్ట్ చేయనున్నారు. మరి ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలకు ఫుల్ గా టైం కేటాయించాలి.

Advertisement
CJ Advs

ఇలాంటి రెండు పెద్ద సినిమాల మధ్య బిగ్ బాస్ సీజన్- 2 చేయడం అవసరమా అనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా షోలో పాల్గొంటున్న వ్యక్తులపై ఎన్టీఆర్ కు అభ్యంతరాలున్నాయి. చిన్న చిన్న ఆర్టిస్ట్స్ ను తీసుకొచ్చి నిలబెట్టడం ఏమాత్రం బాగాలేదని ఎన్టీఆర్ గట్టిగా ఫీలవుతున్నాడు. మరో వైపు స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ సీజన్-2  కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఈసారి సెట్ పూణే లో కాకుండా హైదరాబాద్ లో వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. కానీ ఎన్టీఆర్ మాత్రం వారికి డైరక్ట్ గా చెప్పలేక చూద్దామంటూ విషయాన్ని నానుస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకటి మాత్రం నిజం. మొదటి సీజన్ చూసిన తర్వాత ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయంగా మరో హీరోను మాత్రం ఎవరూ ఊహించుకోలేరు. ఎలాంటి భేషజాలకు పోకుండా కంటెస్టంట్స్ తో కలిసిపోయి ఎన్టీఆర్ షోను రక్తికట్టించిన విధానం. హౌస్ లోకి వెళ్లి అందరికి వంట చేయటం.... ప్రతి ఒక్కరిని ఆయన సంబోధించిన తీరు.. ఇవన్నీ చూసి ఎన్టీఆర్ కు ఆల్టర్నేట్ వెదకటం చాలా కష్టం. అన్నట్టు సీజన్-2  కోసం ఎన్టీఆర్ కు ఇంతకుముందు ఇచ్చిన అమౌంట్ కన్నా కొంచం ఎక్కువే ఇవ్వాలని స్టార్ మా భావిస్తుందంట.

NTR OUT From Bigg Boss Season 2 Host:

Jr NTR not to return for season two of Bigg Boss Telugu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs